ఇటీవల విలక్షణ నటుడు నవాజుద్ధీన్‌ సిద్ధిఖీ వ్యవహారం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆయన వేదిస్తున్నాడంటూ ఆయన భార్య అలియా సంచలన ఆరోపణలు చేయటంతో పాటు నవాజ్‌ తమ్ముడి మీద కూడా వేధింపుల ఆరోపణలు చేసింది. అందుకే తాను నవాజ్‌ నుంచి విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్టుగా ఆమె వెల్లడించింది. తాజాగా నవాజ్‌ తన భార్య అలియాకు లీగల్‌ నోటీసులు పంపించినట్టు ఆయన తరుపు న్యాయదాది అద్నాన్‌ షేక్‌ వెల్లడించాడు.

అలియా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తోందని నోటీసులో పేర్కొన్నారు. ఈ విషయంపై నవాజ్‌ లాయర్‌ మాట్లాడుతూ.. అలియా ఆరోపణల్లో నిజం లేదని తెలిపాడు. తాము అలియా నోటిసులకు స్పందించామని, నెలవారి భత్యం కూడా సకాలంలో స్పందించామని వెల్లడించారు. అందుకు సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌ను తమ వద్ద ఉన్నట్టుగా తెలిపారు. అలియా ఉద్దేశ పూర్వకంగానే నవాజ్‌ కుటుంబం పై విమర్శలు చేస్తోందని, అందుకే ఆమెకు లీగల్‌ నోటీసులు పంపినట్టుగా వివరించారు.

అంతేకాదు ఇక మీదట ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయకూదని, ఇప్పటికే చేసిన ఆరోపణలపై లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నట్టుగా తెలిపాడు. విడాకుల వార్తలపై స్పందిస్తూ ఇప్పటికే అలియా ఇచ్చిన విడాకుల నోటిసుపై స్పందించామని, ప్రస్తుతం అలియానే తమ నోటీసులు మీద స్పందించాల్సి ఉందని తెలిపారు.