సెలబ్రిటీలు ఎవరైనా కనిపిస్తే వారితో ఫోటోలు దిగాలని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి సెలబ్రిటీలకు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. గతంలో ఇటువంటి సంఘటనలు చాలానే జరిగాయి.

ఇప్పుడు బాలీవుడ్ నటుడు నవాజుద్ధీన్ సిద్ధిఖీకి కూడా చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం ఆయన 'రాత్ అకేలీ హై' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో జరుగుతోంది.

ఈ క్రమంలో నవజుద్ధీన్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని కారులో ఎక్కేందుకు వెళ్తుండగా.. ఫ్యాన్స్ అతడితో సెల్ఫీలు తీసుకోవాలని ప్రయత్నించారు. ఓ అభిమాని నవాజుద్ధీన్ వెనుక నుండి వచ్చి నవాజ్ మెడ పట్టుకొని వెనక్కి లాగేశాడు.

దాంతో ఆయన వెనక్కి పడిపోబోయారు. ఇంతలో అప్రమత్తమైన బాడీగార్డ్స్, పోలీసులు సదరు అభిమానిని పక్కకు నెట్టేసి ఆయన్ని జాగ్రత్తగా కారులో కూర్చోబెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Crazy selfie fan #nawazudinsiddiqui #kanpur

A post shared by Viral Bhayani (@viralbhayani) on Feb 25, 2019 at 12:46am PST