భర్త పెట్టే హింసని తెలియజేస్తూ కొన్ని రోజులగా నవాజుద్దీన్ భార్య ఆలియా వరుస వీడియోలో పోస్ట్ చేస్తోంది. భార్య భర్తల మధ్య తలెట్టిన వివాదాలు తారా స్థాయికి చేరుతున్నాయి.
బాలీవుడ్ క్రేజీ నటుల్లో నవాజుద్దీన్ సిద్ధిఖీ ఒకరు. ఎలాంటి పాత్ర అయినా అవలీలగా పోషించగలిగే ప్రతిభ, అనుభవం నవాజుద్దీన్ సొంతం. నటుడిగా ఎంతో కీర్తి దక్కించుకున్న నవాజుద్దీన్.. తన వ్యక్తిగత జీవితంతో మాత్రం రచ్చకెక్కాడు. గత కొంత కాలంగా నవాజుద్దీన్ ఫ్యామిలిలో ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం.
భర్త పెట్టే హింసని తెలియజేస్తూ కొన్ని రోజులగా నవాజుద్దీన్ భార్య ఆలియా వరుస వీడియోలో పోస్ట్ చేస్తోంది. భార్య భర్తల మధ్య తలెట్టిన వివాదాలు తారా స్థాయికి చేరుతున్నాయి. తనని నవాజుద్దీన్ చిత్రవధకి గురి చేస్తున్నాడు అంటూ ఆలియా ఇటీవల కేసు కూడా నమోదు చేసింది. అయితే నవాజుద్దీన్ గత కొన్ని రోజులుగా ఆలియాని ఇంట్లోనే నిర్బంధించి ఉంచాడు.
అయితే తాజాగా నవాజుద్దీన్ తన భార్య పిల్లలని ఇంట్లో నుంచి గెంటివేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఏ మేరకు ఆలియా షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. వెర్సోవా పోలీస్ స్టేషన్ కి వెళ్లి వచ్చాను. తిరిగి వచ్చే సరికి నవాజుద్దీన్ తన కాపలా దారులతో ఇంట్లోకి రానివ్వడం లేదు. నన్ను పిల్లల్ని గేటు బయటే వదిలేశాడు అంటూ ఆ దృశ్యాలు చూపించింది.
ఆలియా పిల్లలతో కలసి గేటు బయటే వెక్కి వెక్కి ఏడుస్తున్న దృశ్యాలు హృదయాలు కలచివేసే విధంగా ఉన్నాయి. నన్ను నా పిల్లని నది రోడ్డుపై నిలబెట్టాడు. నవాజుద్దీన్ అసలు రూపం ఇదే. రోడ్డుపై ఏడుస్తున్న మమ్మల్ని మా బంధువులు తీసుకువెళ్లారు. న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటా అంటూ అలియా పోస్ట్ చేసింది.
