కామెడీ చిత్రాలతో పొట్టచెక్కలయ్యేలా నవ్వించడంలో నవీన్ పొలిశెట్టి దిట్ట. అలాంటిది ఆయనచేత పురాణాలకు చెందిన పాత్రని వేయించే ప్లాన్ చేస్తున్నారట.
రామాయణంపై సినిమాలు చేయాలని దర్శకులు ఆరాటపడుతున్నారు. మొన్న ఓం రౌత్.. ప్రభాస్‌తో `ఆదిపురుష్` పేరుతో రామాయణం తీసి బోల్తా పడ్డాడు. కానీ ఈ పురాణ గాథపై మేకర్స్ లో ఆసక్తి మాత్రం మరింత పెరుగుతుంది. ఎలాగైనా సినిమాలు చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందీలో రామాయణం తీయాలని ప్లాన్ జరుగుతుంది. నితీష్ తివారి దీనికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించబోతున్నారు. పాన్ ఇండియా ఆర్టిస్ట్ లను తీసుకుంటున్నారు. ఒక్కో భాష నుంచి ఒక్కో యాక్టర్ ని తీసుకుంటున్నారు.
రాముడిగా రణ్‌బీర్ కపూర్‌ని నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతుంది. అలాగే సీత పాత్రలో సాయిపల్లవిని అనుకుంటున్నారట. దీంతోపాటు రావణుడి పాత్రకి `కేజీఎఫ్` యష్‌ని ఫైనల్ చేశారని అంటున్నారు. ఇప్పుడు మరో ముఖ్య పాత్ర అయిన లక్ష్మణుడి పాత్రకి ఎవరిని తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా కామెడీ చిత్రాల హీరో నవీన్ పొలిశెట్టి పేరు తెరపైకి వచ్చింది. లక్ష్మణుడి పాత్రకి నవీన్ పొలిశెట్టిని అడుగుతున్నారట. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.
నవీన్‌కి తెలుగుతోపాటు నార్త్ లోనూ మార్కెట్ ఉంది. హిందీలోనూ సినిమాలు చేస్తున్నాడు. దీంతో అందరికి కనెక్ట్ అవుతాడు. దీనికితోడు లక్ష్మణుడి పాత్రలో సీరియస్ నెస్‌తోపాటు కొంత ఫన్నీ కూడా ఉంటుంది. అందుకు నవీన్ అయితే పర్‌ఫెక్ట్ సూట్ అవుతాడని భావిస్తున్నారట. మరి ఆయన ఒప్పుకుంటాడా? అనేది చూడాలి. ఈ మూవీని ఈ ఏడాది ప్రారంభమయ్యే అవకాశాలున్నాయట. మరి ఏం జరుగుతుందో చూడాలి.
నవీన్ పొలిశెట్టి గతేడాది `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` చిత్రంలో నటించారు. అనుష్కతో జోడీ కట్టాడు. ఈ మూవీ మంచి ఆదరణ పొందింది. రాంగ్ టైమ్‌లో వచ్చిన కలెక్షన్ల పరంగా ఓకే అనిపించింది. ఓటీటీలో బాగా నడిచింది. ప్రస్తుతం నవీన్ పొలిశెట్టి సితార బ్యానర్‌లో ఓ మూవీ చేయబోతున్నట్టు తెలుస్తుంది. దీంతోపాటు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో, మైత్రీ మూవీస్‌లో సినిమాలు చేయబోతున్నట్టు టాక్.
