టాలీవుడ్ కుర్ర హీరో నవీన్ పోలిశెట్టి 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాతో హిట్ అందుకున్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. మౌత్ టాక్ తోనే ఈ సినిమా జనాల్లోకి వెళ్లింది. ఈ సినిమా తరువాత నవీన్ కి తెలుగులో మంచి అవకాశాలు వచ్చాయి.

వాటికి సంబంధించిన వివరాలు తెలియాల్సివున్నాయి. ఇంతలో నవీన్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేశాడు. 'ఏజెంట్ ఆత్రేయ' సినిమా సెట్స్ మీద ఉండగానే.. నవీన్ కి హిందీలో 'చిచ్చోరే' అనే సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. 'దంగల్' దర్శకుడు నితీష్ తివారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్, శ్రద్ధా కపూర్ జంటగా నటించారు.

మరో ముఖ్య పాత్రలో నవీన్ పోలిశెట్టి  నటించాడు. బాలీవుడ్ లో కొన్ని వెబ్ సిరీస్ లలో నటించడంతో పాటు కొన్ని ఇంటరెస్టింగ్ వీడియోలు చేసిన నవీన్ నార్త్ లో బాగానే పాపులర్ అయ్యాడు. అతడి టాలెంట్ చూసి నితీష్ తివారి 'చిచ్చోరే'లో మంచి రోల్ ఇచ్చాడు. 3 ఇడియట్స్ మాదిరి కాలేజీ స్నేహాల నేపధ్యంలో సాగే ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. క్రిటిక్స్ కూడా మంచి రివ్యూలు ఇచ్చారు. నవీన్ పెర్ఫార్మన్స్ కి కూడా మంచి మార్కులు పడ్డాయి. మొత్తానికిబాలీవుడ్ లో మన హీరోకి మంచి పేరొచ్చిందనే చెప్పాలి!