Asianet News TeluguAsianet News Telugu

కలర్‌ తక్కువున్నావ్‌ సర్జరీ చేయించుకోమన్నారు.. నవీన్‌ పొలిశెట్టి కన్నీటి గాథ.. ఒంటరిగా ఏడ్చుకుంటూ..

తెరపై కడుపుబ్బ నవ్వించే నవీన్‌ పొలిశెట్టి.. తెరకవెనుక మాత్రం కన్నీళ్లు పెట్టించే స్టోరీ ఉంది. హీరోగా పరిచయం కాక ముందు కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయట. 

naveen polishetty open up his tears life story at audition time rj
Author
First Published Sep 11, 2023, 3:22 PM IST

కామెడీ చిత్రాల హీరోగా పాపులర్‌ అయ్యాడు నవీన్‌ పొలిశెట్టి. `ఏజెంట్ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ`, `జాతిరత్నాలు` చిత్రాలతో తానేంటో నిరూపించుకున్నాడు. కామెడీ చిత్రాలకు నయా ట్రెండ్‌ సెట్టర్‌ అయ్యారు. ఇటీవల అనుష్కతో కలిసి `మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి` చిత్రంలో నటించాడు. ఈ సినిమాకి పాజిటివ్‌ రెస్పాన్స్ వస్తోంది. నెమ్మదిగా పుంజుకుంటుంది. 

ఇదిలా ఉంటే తెరపై కడుపుబ్బ నవ్వించే నవీన్‌ పొలిశెట్టి.. తెరకవెనుక మాత్రం కన్నీళ్లు పెట్టించే స్టోరీ ఉంది. హీరోగా పరిచయం కాక ముందు కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయట. ఒంటరిగా బోరున విలపించానని తెలిపారు నవీన్‌. ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీకి రావాలంటే చాలా కష్టమని, దాన్ని ఫేస్‌ చేయడం చాలా దారుణమైన పరిస్థితి అని తెలిపారు. తాను ఆడిషన్స్ ఇచ్చే రోజుల్లో అత్యంత బాధపడినవి, కన్నీళ్లు పెట్టుకున్న రెండు సందర్భాలు పంచుకున్నారు నవీన్‌ పొలిశెట్టి. ప్రేమతో ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు చెప్పారు.

లండన్‌లో జాబ్‌ మానేసి సినిమా అవకాశాల కోసం ముంబాయికి వచ్చినప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాటడ. చిన్న చిన్న పార్ట్ టైమ్‌ జాబ్‌లు చేసేవాడట. రెంట్‌ కట్టాలంటే ముంబయిలో చాలా కష్టంగా ఉండేదన్నారు. సినిమా ఆడిషన్స్ కి వెళ్లేటప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ పరిచయ అవుతుంటారు. వారితో కలిసి సినిమాకి వెళ్లాలన్నా, రెస్టారెంట్‌కి వెళ్లాలన్నా చాలా ఇబ్బంది పడేవాడినిఅని, తన ఆర్థిక పరిస్థితి వారికి చెప్పలేక, వారితో వెళ్లలేక రకరకాల కారణాలు చెప్పి తప్పించుకునేవాడినని తెలిపారు. 

రెండేళ్లపాటు ఆడిషన్స్ ఇచ్చానని, కానీ ఒక్క ఆఫర్‌ కూడా వచ్చేది కాదన్నారు. ఒక్క ఆఫర్‌ ఉంటే ఫైనల్‌ ఇద్దరు సెలక్షన్లలో తాను ఉండేవాడినని, కానీ చివరగా మాత్రం తనకు అవకాశం వచ్చేది కాదని, అలాంటి సందర్బాలు ఎన్నో చూసినట్టు చెప్పాడు నవీన్‌. దీంతో ఇక్కడ రాణించాలంటే, అవకాశాలు రావాలంటే బ్యాక్ గ్రౌండ్‌ కూడా కావాలని అర్థమయ్యిందని తెలిపారు. అదే సమయంలో హీరోగా అవకాశం రావాలంటే  ఎంత మార్కెట్‌ చేయగలడనేది మాత్రమే చూసే వారని, టాలెంట్‌ గురించి మాట్లాడేవారు కాదన్నారు. 

చాలా వరకు ఆడిషన్స్ కి వెళ్లిప్పుడు.. ఆడిషన్‌ జరగడానికి ముందే కాస్టింగ్‌ డైరెక్టర్లు వచ్చి కలర్‌ తక్కువున్నావని, సర్జరీ చేయించుకోమని చెప్పేవారట. సిక్స్ ప్యాక్‌ బాడీ, వైట్‌గా ఉండాలనే వారట. ఇది చేయు, అది చేయు అని చెప్పేవారని, కానీ యాక్టింగ్‌ గురించి తాను ఎలా యాక్ట్‌ చేస్తాననేది చూసేవారు కాదన్నారు. ఇలా రెండేళ్లపాటు ఆడిషన్స్ చేసినా ఒక్క ఆఫర్‌ కూడా రాలేదు. దీంతో ఫ్రస్టేషన్‌ పీక్‌లోకి వెళ్లినట్టు చెప్పాడు నవీన్‌. ఆ సమయంలో బాగా ఏడుపొచ్చిందట. ముంబయిలో రైల్వే ట్రాక్‌పై నడుస్తున్నప్పుడు తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయని, ఆ సమయంలో గట్టిగా అరుస్తూ ఏడ్చేవాడినని, ఎవరైనా చూస్తే ఏమైందో అనుకునే వాళ్లని, అంత పీక్‌లో ఏచ్చేశానని తెలిపారు నవీన్‌. అలాంటి బాధ ఎవరూ పడకూడదని తెలిపారు. 

అయితే తన కెరీర్‌ ని మాత్రం ఆయన ముందే ఊహించాడట. ఈ స్టేజ్‌ వస్తుందని తాను ఊహించినట్టు తెలిపారు. కాస్త లేట్‌గా లైఫ్‌ వస్తుందేమో గానీ, కచ్చితంగా వస్తుందనే నమ్మకంతో ఉండేవాడట. ఇక మొదట్లో తెలుగులో రెండు మూడు సినిమాల్లో మెరిశాడు నవీన్‌. `లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్`, `డీ ఫర్‌ దోపిడి`, `వన్‌ నేనొక్కడినే` చిత్రాల్లో కీలక పాత్రలు పోయించారు. నాలుగేళ్ల క్రితం `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` సినిమాతో హీరోగా టాలీవుడ్‌కి పరిచయం అయ్యారు. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. ఆ తర్వాత `జాతిరత్నాలు`తో పెద్ద హిట్‌ని అందుకున్న విషయం తెలిసిందే. 
 

Follow Us:
Download App:
  • android
  • ios