మహేష్ బాబు అలా ట్వీట్ చేయడంతో... రాత్రంత నిద్రపట్టలేదు.. నవీన్ పోలిశెట్టి కామెంట్స్ వైరల్
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో సూపర్ సక్సెస్ సాధించాడు నవీన్ పోలిశెట్టి. ఈ సినిమా విజయోత్సాహంలో ఉన్న నవీన్ కు సంతోషంలో ఏం చేయాలో తోచడంలేదట. అంతే కాదు.. ఈసినిమా గురించి ఓ ట్వీట్ చూసిన ఆయనకు అస్సలు నిద్రపట్టలేదట.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో సూపర్ సక్సెస్ సాధించాడు నవీన్ పోలిశెట్టి. ఈ సినిమా విజయోత్సాహంలో ఉన్న నవీన్ కు సంతోషంలో ఏం చేయాలో తోచడంలేదట. అంతే కాదు.. ఈసినిమా గురించి ఓ ట్వీట్ చూసిన ఆయనకు అస్సలు నిద్రపట్టలేదట.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్, జేజమ్మ.. అనుష్క శెట్టి (Anushka Shetty),కామెడీ హీరో నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) కాంబినేషన్ లో వచ్చిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి (Miss Shetty Mr Polishetty).పి.మహేష్ బాబు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ ఈసెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చి..సూపర్ సక్సెస్ టాక్ తెచ్చుకుంది. కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈసినిమాను యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు నిర్మించారు. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది సినిమా.
అనుష్క, నవీన్ కాంబినేషన్ ఎలా ఉంటుంది అని అంతా ఎదురుచూస్తుండగా.. రిలీజ్ అవ్వడంతోనే వచ్చిన కామెంట్స్ చూస్తే.. కెమిస్ట్రీ ఆకట్టుకోగా, కామెడీకి జనాలు ఫిదా అయ్యారు. ఈసినమాకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. అయితే ఈసినిమా సక్సెస్ పై నవీన్ పొలిశెట్టి స్పందించారు. ఆడియన్స్ ఇచ్చిన ఈ అఖండ విజయానికి కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఈక్రమంలోనే తెలుగు ప్రేక్షకులకు నవీన్ ఓ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
అయితే ఈ వీడియోలో నవీన్ చాలా విషయాలు వెల్లడించారు. ఆయన ప్రస్తుతం వర్జీనియాలో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ప్రమోషన్స్ కోసం సియాటెల్‌కు వెలుతున్నట్లు తెలిపాడు. అయితే వర్షం కారణంగా విమానాలు లేకపోవడంతో 15 గంటలుగా ఎయిర్‌పోర్టులోనే ఉన్నట్లు చెప్పారు నవీన్. అంతే కాదు వేరే భాషా సినిమాలతో పాటు తాను నటించిన సినిమాను విడుదల చేయడంపై మొదట్లో కంగారు పడినట్లు వెల్లడించాడు. అయితే.. ప్రేక్షకుల నుంచి తన సినిమాకు వస్తున్న ఆదరణ చూసి ఎంతో సంతోషంగా ఉన్నట్లు చెప్పాడు.
అంతే కాదు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాను ప్రేక్షకులతో పాటు పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా అభినందిస్తుండటంపై ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ విధంగా కొంత మంది స్టార్లు చేసిన ట్వీట్ల పై నవీన్ మాట్లాడాడు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) చేసిన ట్వీట్ చూసిన తరువాత తనకు రాత్రి అంతా నిద్ర పట్టలేదన్నాడు. త్వరలోనే వస్తానని, ప్రేక్షకులను కలుసుకుంటానని చెప్పాడు.