ఎన్టీఆర్ సినిమాలో మరో హీరో ఉన్నాడట

ఎన్టీఆర్ సినిమాలో మరో హీరో ఉన్నాడట

ఎట్టకేలకు ఎన్టీఆర్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ మొదలైంది. ఇందులో తారక్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చేస్తున్న విషయం తెలిసిందే. రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో తీస్తున్న ఈ సినిమా లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది. రీసెంట్ గా జగపతిబాబు కూడా షూట్ లో పాల్గొన్నారు.

అంతేకాదండోయ్ ఈ సినిమాలో కీలకమైన పాత్రకోసం మరో టాలీవుడ్ హీరో కూడా ఉన్నాడట. అతను ఎవరో కాదు అందాల రాక్షసి మూవీతో అందరిని ఆకట్టుకున్న నవీన్ చంద్ర. నేను లోకల్ మూవీలో కీలకమైన పాత్రతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో నవీన్ చంద్ర పెర్ఫామెన్స్ చూసి.. త్రివిక్రమ్ ఇతడికి ఓ మంచి రోల్ ఆఫర్ చేశాడట. చాలా కాలంగా పెద్ద బ్యానర్ లో.. భారీ చిత్రంలో చేయాలనే కోరికతో ఉన్న నవీన్ చంద్ర వెంటనే ఈ రోల్ ను యాక్సెప్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఎన్టీఆర్ సినిమాలో కీలకమైన క్యారెక్టర్ అంటే.. కచ్చితంగా అది నవీన్ చంద్రకు కెరీర్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. తనలోని నటుడి నుంచి ఓ కొత్త కోణాన్ని ఈ చిత్రం బయటకు తీస్తుందని నమ్మకంగా ఉన్నాడట నవీన్ చంద్ర. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos