జై సినిమాతో హీరోగా పరిచయమైన నవదీప్ హిట్స్ లేక నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలు చేసిన నవదీప్ బాద్ షా లో విల‌న్ గా న‌టించినందుకు బాధపడుతున్న నవదీప్ 

జై సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు నవదీప్. ఆ తర్వాత కొన్ని సినిమాలు తీసినా.. వాటి వల్ల ఆశించిన ఫలితాలు మాత్రం రాలేదు. దీంతో అతడికి హీరో గా అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రల్లోకి ప్రవేశించాడు నవదీప్. ఆ కోవలోనే ఆర్య-2లో అజయ్ అనే నెగెటివ్ షేడ్‌లో కనిపించాడు. ఆ తర్వాత బాద్‌షాలో విలన్‌గా కనిపించాడు.

 తాజాగా.. రామ్‌చరణ్ నటించిన ధృవ సినిమాలో హీరోకు సపోర్టింగ్ కేరెక్టర్ చేసి మంచి మార్కులు కొట్టేశాడు. కానీ, అతడు మాత్రం బాద్‌షా సినిమాలో తారక్‌ పక్కన విలన్‌గా చేసి ఉండాల్సింది కాదని అంటున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా స్క్రిప్ట్ దశలో.. తన కేరెక్టర్ బాగా వర్కవుట్ అవుతుందని భావించానని, తీరా సినిమా చూశాక అరె..అనవసరంగా చేశానే అని అనిపించిందని అన్నాడు. 

విలన్ పాత్రలకు బదులుగా ఆర్య-2లో చేసిన నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలకైనా ఓకే గానీ, బాద్‌షా సినిమాలోని పాత్రలు మాత్రం అనవసరమని అన్నాడు. అయితే.. బాద్‌షా సినిమా సూపర్ హిట్టయితే నవదీప్ నోటి వెంట ఇలాంటి మాటలు వచ్చి ఉండేవి కావని, వేరేలా మాట్లాడేవాడని ఫిల్మ్‌నగర్‌లో చర్చించుకుంటున్నారు.