ప్రముఖ అమెరికన్ టీవీ సిరీస్ ‘రే డోనావన్’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌లో అడల్ట్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉందని విమర్శలు వస్తున్నాయి. విచ్చలవిడి అశ్లీల సన్నివేశాలు, అసభ్య పదజాలం కారణంగా తీవ్రమైన నెగెటివిటీ వచ్చింది. 

స్టార్ హీరోలు వెంకటేశ్‌ , రానా కలిసి నటించిన వెబ్‌ సిరీస్‌ ‘రానా నాయుడు’. ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix) వేదికగా మార్చి 10న తెలుగు, తమిళ్‌, మలయాళం, హిందీలో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే రిలీజైన నాటి నుంచే తెలుగులో ఈ సిరీస్‌ విమర్శలు ఎదుర్కొంటోంది. ‘అగ్ర హీరోలు అయి ఉండి ఇలాంటి అడల్డ్‌ కంటెంట్‌ని ప్రోత్సహించడం తగునా?’ అంటూ పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ప్రశ్నలు లేవనెత్తారు. ఓటీటీలో ప్రసారమయ్యే వాటికీ సెన్సార్‌ తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు, ఈ సిరీస్‌పై పాజిటివ్‌ స్పందన ఉంది. ‘నెట్‌ఫ్లిక్స్‌’ టాప్‌ 10 జాబితాలో ఈ సిరీస్‌ ఒకటిగా నిలిచింది. ప్రముఖ అమెరికన్ టీవీ సిరీస్ ‘రే డోనావన్’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌లో అడల్ట్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉందని విమర్శలు వస్తున్నాయి. విచ్చలవిడి అశ్లీల సన్నివేశాలు, అసభ్య పదజాలం కారణంగా తీవ్రమైన నెగెటివిటీ వచ్చింది. 

ఈ నేపధ్యంలో రానా నాయుడు వెబ్ సిరీస్ గురించి నటుడు నవదీప్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో వెబ్ సిరీస్ గురించి ప్రశ్న వేయగా.. ప్రస్తుత జనరేషన్‌కు నచ్చుతుందని చెప్పారు. వారు చూసి ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు. తనలాగా చాలా మంది చూసి ఆనందిస్తున్నారని వివరించారు. అలా కోట్ల మంది ఉంటారని.. అందుకే ఆ వెబ్ సిరీస్ నెట్ ప్లిక్స్‌లో ట్రెండింగ్‌లో ఉందని చెప్పారు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని.. తనకు మాత్రం నచ్చిందని నవదీప్ తెలిపారు. వెబ్ సిరీస్ చూశామా..? నచ్చిందా..? లేదా మాత్రమే చెప్పగలం అన్నారు. ముంబై నేపథ్యంలో సాగిన కథ అయినందున.. అలానే ఉంటుందని వివరించారు. అక్కడి కల్చర్ ఎలా ఉంటుందో తనకు తెలుసు అని.. అందుకే సరదాగా చూశాం అని క్లారిటీ ఇచ్చారు. అలాగే ఈ సీరిస్ కొందరికీ నచ్చకపోవచ్చు.. వారి అభిప్రాయం వారిది. ఎందుకంటే న్యూడిటీ గురించి అంతా అనుకుంటారు. కాకుంటే మెసేజ్ కూడా అర్థం చేసుకోవాలని సూచించారు.

 సిరీస్‌లో న్యూడిటీ ఎక్కువగా ఉంది. డైలాగులు కూడా పచ్చిగా ఉన్నాయి. ఫ్యామిలీ హీరో వెంకటేష్ (venkatesh) చేత బొల్డ్ డైలాగ్స్ చెప్పించారు. రానా (rana) కూడా అలాంటి ఓ సీన్‌లో నటించారు. మరో ప్రక్క తెలుగు ఆడియోను నెట్‌ఫ్లిక్స్‌ తొలగించింది. ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో.. ఆ సిరీస్‌ను చూడాలనుకున్న తెలుగు ప్రేక్షకులకు నిరాశ ఎదురైనట్టైంది. దీనిపై ఇప్పటికే పలువురు నెటిజన్లు మీమ్స్‌ క్రియేట్‌ చేసి, వైరల్‌ చేస్తున్నారు. అసభ్య పదజాలం, అశ్లీల దృశ్యాలు ఎక్కువగా ఉన్నాయంటూ తెలుగు వెర్షన్‌కి సంబంధించి ట్రోల్స్‌ రావడం వల్లే సంస్థ తీసేసి ఉంటుందని కొందరు సోషల్‌ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, సాంకేతిక సమస్యల కారణంగానే తొలగించినట్లు ఆడియోను తొలగించినట్లు తెలిసింది. వీలైనంత త్వరలో ఆడియోను అందుబాటులోకి తీసుకురానున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

ఇక ఇప్పటికే వెంకటేష్, రానా అభిమానులు చూసి ఉంటారు. లేడీస్ మాత్రం చూసే ధైర్యం చేయరు. పెద్ద వారి నుంచి కూడా వ్యతిరేకత రానుంది. విడుదలయిన వెంటనే నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. అయినప్పటికీ వెబ్ సిరీస్ మాత్రం ట్రెండింగ్‌లో ఉంది. దీని సెకండ్ సీజన్ కూడా ఉండే అవకాశం ఉంది.