ఆ డైరెక్టర్ నా తొడలపై చేతులు వేసి హోమోసెక్స్ కోరాడు: యువనటుడు

navajith narayanan opens up about casting couch in mollywood
Highlights

ఒక దర్శకుడు నాకు సినిమాలో అవకాశం ఇప్పిస్తా అన్నాడు. దానికి ప్రతిఫలంగా ఏం ఇస్తావని ప్రశ్నించాడు. నాతో మాట్లాడుతూనే నా తొడలపై చేతులు వేసి శారీరకంగా దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు

సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పెద్ద దుమారాన్ని రేపుతోంది. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ ఇలా భాషల ఇండస్ట్రీలలో కూడా కాస్టింగ్ కౌచ్ ఉందని అనేవారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. అయితే కాస్టింగ్ కౌచ్ అమ్మాయిలకు మాత్రమే కాదని తను కూడా ఎదుర్కొన్నట్లు నటుడు రవికిషన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో పురుషులకు కూడా ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయా అని అందరూ ఆశ్చర్యపోయారు.

ఇప్పుడు మరో మలయాళీ యువనటుడు తను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితుడినని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. మలయాళ యువనటుడు నవజిత్ నారాయణ్ మాకు కూడా భద్రత లేదు అంటూ తన ఫేస్ బుక్ అకౌంట్ లో ఓ పోస్ట్ పెట్టాడు. ''ఒక దర్శకుడు నాకు సినిమాలో అవకాశం ఇప్పిస్తా అన్నాడు. దానికి ప్రతిఫలంగా ఏం ఇస్తావని ప్రశ్నించాడు. నాతో మాట్లాడుతూనే నా తొడలపై చేతులు వేసి శారీరకంగా దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. నాకు ఆ ఉద్దేశం లేదని.. చేతులు తీయాలని అతడిని కోరాను. కానీ అతడు తీయకపోవడంతో చెంప పగలగొట్టాను'' అంటూతన పోస్ట్ లో రాసుకొచ్చాడు.

అయితే సదరు దర్శకుడు పేరు చెప్పడానికి మాత్రం అంగీకరించలేదు. అతడు తన కుటుంబానికి స్నేహితుడని.. వారి ముందు అతడ్ని దోషిగా నిలబెట్టడం ఇష్టం లేదని అన్నారు. సినిమా కోసం అతడి హోమో సెక్స్ కోరడం బాధ కలిగించిందని నవజిత్ వాపోయాడు. 


  

loader