ఒకప్పుడు హీరోగా పలు సినిమాల్లో నటించిన నవదీప్.. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా కొన్ని సినిమాలు చేశాడు. బిగ్ బాస్ సీజన్ 1లో కనిపించి తెగ అల్లరి చేశాడు. గత కొంతకాలంగా నవదీప్ కి సినిమా అవకాశాలు బాగా తగ్గాయి.

ఈ క్రమంలో అతడు కొత్త బిజినెస్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. హైదరాబాద్ లో ఓ బహుళ అంతస్థుల భవనాన్ని లీజ్ కి తీసుకున్న నవదీప్ ఇప్పుడు అందులో స్టూడియో లాంటిది ఏర్పాటు చేస్తున్నాడు. స్టోరీ డిస్కషన్స్, ఎడిటింగ్ వర్క్, రీరికార్డింగ్ వంటి పనులకు అనుకూలంగా ఉండేలా ఓ అపార్ట్మెంట్ ని తీర్చిదిద్దుతున్నాడు.

ఇందులో కాఫీ షాపులు, రెస్టారెంట్లు కూడా ఉంటాయి. ఈ మధ్యకాలంలో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు చేయడానికి యూత్ బాగా ఆసక్తి కనబరుస్తోంది. అటువంటి వారికి తక్కువ  ఖర్చులో సాంకేతిక నైపుణ్యాన్ని అందించబోతున్నాడు.

నవదీప్ కి ఇండస్ట్రీలో పరిచయాలు కూడా ఎక్కువే.. వాటిని ఉపయోగించుకొని ఈ రంగంలో సక్సెస్ అవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. మరి నవదీప్ కి ఈ కొత్త వ్యాపారం ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి!