కెరీర్ మొదట్లో హీరోగా ఎంట్రీ ఇచ్చి పెద్దగా సక్సెస్ లు అందుకోలేకపోయిన నవ దీప్ మెల్లగా సపోర్టింగ్ క్యారెక్టర్స్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అవసరమైనప్పుడు నెగిటివ్ రోల్స్ కూడా చేస్తున్నాడు. మొత్తానికి ఎదో ఒక విధంగా సెట్టయినా నవదీప్ ఇప్పుడు సరికొత్త లుక్ లో అందరికి షాకిచ్చాడు. 

అసలు అతను నవదీప్ కాదని కూడా కొందరు కామెంట్ చేయడం విడ్డురం. అదిరిపోయే కండలతో హాలీవుడ్ హీరోలను సైతం మైమరపిస్తున్నాడు. నవదీప్ ఎంతగా కష్టపడ్డాడో ఈ ఒక్క ఫొటోతో ఊహించుకోవచ్చు.  ఇంతకు నవదీప్ ఇంత ఫిట్ గా ఎందుకు రెడీ అయ్యాడో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. బహుశా బాలీవుడ్ బడా సినిమాల్లో అవకాశం కోసం ట్రై చేసి ఉండవచ్చని కథనాలు వెలువడుతున్నాయి. 

అయితే తాను ఇలా మారడానికి ట్రైనర్ కృష్ణ సద్వలే కృషి కూడా ఉందని అన్నాడు. అలాగే అల్లు అర్జున్ - రానా - రామ్ చరణ్ కూడా ఎంతో స్ఫూర్తినిచ్చారని చెబుతూ వారికి కృతజ్ఞతలని నవదీప్ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు. ఇక నవదీప్ ప్రస్తుతం 'వీరమాదేవి'.. 'సీరు' అనే రెండు తమిళ్ సినిమాలతో పాటు త్రివిక్రమ్ - బన్నీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.