ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2021వ చిత్రోత్సవంలో తెలుగు సినిమా ఎంపికైంది. ఇండియన్ పనోరమా సెక్షన్‌లో `నాట్యం` సినిమా స్క్రీనింగ్ కి ఎంపిక కావడం విశేషం.
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఇఫీ)-2021(International Film Festival of India) ప్రకటన వచ్చింది. ఈ ఏడాదికి సంబంధించి జరిగే 52వ ఇఫీ(Iffi) వేడుక నేడు(శుక్రవారం) మినిస్ట్రీ ఆఫ్ ఇన్‌ఫర్మెషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్(కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసారాల శాఖ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నవంబర్ 20 నుంచి 28 వరకు తొమ్మిది రోజులపాటు ఈ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగనున్నాయి. ఇందులో 25 ఫీచర్ ఫిల్మ్స్, 20 నాన్ ఫీచర్ ఫిల్మ్స్ ని ప్రదర్శణకు ఎంపిక చేసింది. ఇండియా నుంచి వివిధ భాషల నుంచి 221 సినిమాలను పరిశీలించిన జ్యూరీ ఫైనల్‌గా 25 ఫీచర్ ఫిల్మ్స్ ని ఎంపిక చేశారు.
ప్రముఖ నటుడు, ఫిల్మ్ మేకర్ ఎస్ వీ రాజేంద్ర సింగ్ బాబు సాధర్యంలో ఏర్పడిన 12 మంది జ్యూరీ ఫీచర్ ఫిల్మ్స్ ని ఎంపిక చేశారు. డైమాసాకి చెందిన `సేమ్‌ఖోర్` చిత్రం ఓపెనింగ్ సెర్మనీగా ప్రదర్శించనున్నారు. అయితే ఇందులో ఇండియన్ పనోరమా సెక్షన్‌లో తెలుగు సినిమా `నాట్యం`(Natyam) పోటీలో నిలవడం విశేషం. అంతేకాదు తెలుగు నుంచి ఎంపికైన ఏకైక చిత్రం Natyam కావడం మరో విశేషం. దీంతోపాటు ఇటీవల ఇండియా నుంచి ఆస్కార్ నామినేషన్‌కి ఎంపికైన తమిళ సినిమా `కూజాంగల్` సినిమా కూడా పనోరమా సెక్షన్‌లో పోటీలో ఉంది. ఈ సినిమాని నయనతార, ప్రియుడు విఘ్నేష్ శివన్ కలిసి నటించారు.
ఇక తెలుగు నుంచి ఎంపికైన `నాట్యం` చిత్రానికి రేవంత్ కోరుకొండా దర్శకత్వం వహించగా, నాట్యకారిణి సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించారు. ఆమె స్వయంగా నాట్యకారిణి కావడం విశేషం. మోడ్రన్ లైఫ్‌లో నాట్యం, సాంప్రదాయ నృత్య విలువని, ప్రధాన్యతని తెలియజేయాలని ఉద్దేశ్యంతో రూపొందించిన ఈ సినిమా అక్టోబర్ 22న విడుదలై విమర్శకుల ప్రశంసలందుకుంది. ఈ సినిమాకి బాలకృష్ణ, ఎన్టీఆర్, రామ్‌చరణ్, చిరంజీవి వంటి వారు ప్రోత్సహించడం విశేషం.
ఇక పనోరమా సెక్షన్‌లో అవార్డుల కోసం పోటీ పడుతున్న చిత్రాల్లో బెంగాలీ నుంచి `కల్కోఖ్కో`, `నిటాన్షన్ సహజ్ సరల్`, `అభిజాన్`, `మనిఖ్బబుర్ మెగా`, `డిక్షనరీ`.. బోడో భాష నుంచి `సిజో`, డైమాసా భాష నుంచి `సేమ్‌ఖోర్`, `గుజరాతీ నుంచి `21వ టిఫిన్`, హిందీ నుంచి `ఎయిట్ డౌన్ టూఫాన్ మెయిల్`, `ఆల్ఫా బీటా గామా`, కన్నడ నుంచి `డోల్లు`, `టతెదండా`, `యాక్ట్ 1978`, `నీలీ హక్కీ`, మలయాళం నుంచి `నిరయే తాథాకలులా మరమ్`, `సన్నీ`, మరాఠి నుంచి `మీ వసంత్‌రావ్`, `బిట్టర్‌స్వీట్`, `గోదావరి`, `ఫ్యూనెరల్`, మిషింగ్ నుంచి `బూంబా రైడ్`, సంస్క్రిత్, భగవదజ్జుకమ్`, తమిళం నుంచి `కూజాంగల్`, తెలుగు నుంచి `నాట్యం` చిత్రాలున్నాయి.
also read: Samantha: విడాకుల తర్వాత ఫస్ట్ దీపావళి... సమంత ఎవరితో సెలెబ్రేట్ చేసుకుందో తెలిస్తే షాక్
