బాలీవుడ్‌లో గత ఏడాది విడుదలై పెద్ద విజయాన్ని సాధించిన చిత్రం `అంధాధున్`. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టుబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని.... శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో నటనకుగానూ ఆయుష్మాన్ ఖురానా జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అందుకున్నారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని  తమిళంలో రీమేక్ చేస్తున్నారు. 

ఇప్పుడు తెలుగు వర్షన్‌ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించేందుకు నాని ఆసక్తిగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే గ్యాంగ్‌ లీడర్‌ షూటింగ్‌ పూర్తి చేసిన నాని, ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాని నెగెటివ్‌ రోల్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమా తరువాత అంధాదున్‌ రీమేక్‌ను పట్టాలెక్కించాలని భావిస్తున్నాడు. ఇక ఈ చిత్రం చైనాలోనూ మంచి విజయం సాథించింది.  ఆ తర్వాత ఈ సినిమాను ‘పియానో ప్లేయర్‌’ టైటిల్‌తో చైనాలో రిలీజ్‌ చేశారు చిత్రబృందం. అక్కడ ఈ సినిమాకు విశేష స్పందన లభించింది. ఇప్పటికే ఈ సినిమా అక్కడ 300 కోట్ల రూపాయలను వసూలు చేసింది.  
 
‘పియానో ప్లేయర్‌’గా ఆయుష్మాన్‌ ఖురానా నటించిన ఈ చిత్రానికి అక్కడ జనం కాసుల వర్షం కురిపించారు. కథలో కంటెంట్‌ ఉంటే స్టార్‌ కాస్టింగ్‌తో సంబంధం లేదని నిరూపించారు. శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకత్వంలో టబు, ఆయుష్మాన్‌ ఖురానా, రాధికా ఆప్టే ముఖ్య తారలుగా రూపొందిన హిందీ చిత్రం ‘అంథా ధూన్‌’.