నాని 'శనివారం' స్టోరీ ఇదేనా.. అదే ట్విస్ట్ అంటూ రూమర్లు వైరల్ ?
నేచురల్ స్టార్ నాని ఈ విజయదశమికి కొత్త చిత్రం ప్రారంభించి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆశ్చర్యం నాని సినిమా ప్రారంభించినందుకు కాదు.. ఆ చిత్ర టైటిల్, టీజర్ ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ గా మారాయి.
నేచురల్ స్టార్ నాని ఈ విజయదశమికి కొత్త చిత్రం ప్రారంభించి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆశ్చర్యం నాని సినిమా ప్రారంభించినందుకు కాదు.. ఆ చిత్ర టైటిల్, టీజర్ ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ గా మారాయి. ఆ చిత్రమే 'సరిపోదా శనివారం'.. అంటే సుందరానికీ ఫేమ్ వివేక్ ఆత్రేయకి మరో ఛాన్స్ ఇస్తూ నాని నటిస్తున్న చిత్రం ఇది.
ఇప్పటి వారకు సాఫ్ట్ మూవీస్ చేసిన వివేక్ ఆత్రేయ.. సరిపోదా శనివారం టీజర్ తో సర్ప్రైజ్ చేసేశారు. నాని చేతికి భారీ గొలుసులతో మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. అతడికి ఒక్కరోజు చాలు అంటూ సాయి కుమార్ చెబుతున్న డైలాగులు అనేక రకాల ఊహాగానాలకు తావిస్తున్నాయి.
అంటే నానికి శనివారం రోజు మాత్రమే అతీతమైన శక్తులు వస్తాయని.. సూపర్ హీరోగా మారుతాడని.. మిగిలిన రోజుల్లో కామన్ మాన్ గా ఉంటాడని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్ర కథలో అసలు పాయింట్ నానికి ఆ ఒక్కరోజు శక్తులు రావడమే.. ఆ ఒక్క రోజే ఎందుకు అనేది ట్విస్ట్ అని ఎవరికీ వారు కథలు అల్లేసుకుంటున్నారు.
మన పురాణాల్లో ఇలాంటి అంశాలు చాలానే చూసాం.. కర్ణుడికి అవసరమైనప్పుడు అతడి వరాలు పనిచేయవు.. ఈ బాణాన్ని ఒక్కసారే ప్రయోగించగలవు.. ఇలాంటి అంశాలు చాలానే ఉంటాయి. ఆ తరహాలోనే వివేక్ ఆత్రేయ కథని సిద్ధం చేసారా అని చర్చ జరుగుతోంది. అయినా దర్శకుడు ఇంత ఈజీగా ఊహించేసే కథని ఎంపిక చేసుకుంటాడా... శనివారంకి సంబందించి ఇంకేదో ఉంది అని మరికొందరు అంటున్నారు. ఓవరాల్ గా సినిమా ప్రారంభంలోనే సరిపోదా శనివారం చిత్రానికి సరిపోయేత పబ్లిసిటీ లభించింది.
ఈ చిత్రంలో మాళవిక మోహన్ రెండవసారి నానితో రొమాన్స్ చేస్తుండగా.. డివివి దానయ్య నిర్మిస్తున్నారు.