మెగాస్టార్ మూవీ రీమేక్ పై కన్నేసిన నాని

First Published 15, Feb 2018, 4:54 PM IST
natural star nani remake plans for megastar chiranjeevi movie
Highlights
  • హీరోగా తనకంటూ క్రేజ్ సంపాదించుకున్న నేచురల్ స్టార్ నాని
  • తాజాగా అ! చిత్రంతో నిర్మాతగా మారిన నాని
  • ప్రమోషన్ ఇంటర్వ్యూలో మెగాస్టార్ మూవీ రీమేక్ గురించి చెప్పిన నాని

హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న నేచురల్ స్టార్ నాని. అ..! సినిమాతో నిర్మాతగా మారాడు. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా తను ఆసక్తికరమైన కోరిక వెల్లడించాడు. తాను ఓ క్రేజీ హీరో మూవీని రీమేక్ చేయాలనే కోరిక వెలిబుచ్చాడు.

 

అ..! చిత్ర ప్రమోషన్ లో బిజీగా పాల్గొంటున్న నానిని.. రీమేక్ చేయాలంటే ఈ చిత్రాన్ని ఎంచుకుంటారు అని అడగగా నాని మెగాస్టార్ చిరంజీవి నటించిన చంటబ్బాయి సినిమాను రీమేక్ చేయాలనే కోరిక వుందంటూ సమాధానం ఇచ్చాడు. మెగాస్టార్ చిరు నటించిన చంటబ్బాయ్ సినిమాని రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన తన మైండ్ లో ఉందని నాని తెలిపాడు.

 

మెగాస్టార్ లోని కామెడీ టైమింగ్ ని పర్ఫెక్ట్ ఆవిష్కరించిన చిత్రం అది. 80 లలో వచ్చిన చంటబ్బాయ్ చిత్రం చిరులోని కామెడీ యాంగిల్ ని బయటకు తీసింది. ప్రముఖ రచయిత, దర్శకులు జంధ్యాల ఈ చిత్రానికి దర్శకులు. జంధ్యాల ఈ చిత్రంలో చిరంజీవిని సరికొత్తగా ఆవిష్కరించారు. చిరులోని కామెడీ యాంగిల్ ని ఆయన వెండి తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు.

 

ఇక కామెడీ పండించడంలో నానిది సరికొత్త శైలి. చంటబ్బాయ్ చిత్రంలో మెగాస్టార్ పోషించిన డిటెక్టివ్ రోల్ కి నాని కచ్చితంగా సూటవుతాడనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నిర్మాతగా కొత్త అవతారం హీరోగా వరుసపెట్టి హిట్లు కొడుతున్న నాని, తొలిసారి నిర్మాతగా మారి అ ! చిత్రాన్ని చేస్తున్నాడు. ప్రమోషన్ లో కూడా పాల్గొంటూ అన్నీ తానై ముందుకు నడిపిస్తున్నాడు.

 

కాజల్, నిత్య మీనన్, రెజీనా, శ్రీనివాస్ అవసరాల వంటి స్టార్లంతా ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో.. ఎవరెవరు ఎలాంటి పాత్రల్లో కనిపించబోతున్నారు అనేది అంతా సస్పెన్స్. సినిమా చూసి తెలుసుకోవలసిందే. నాని చేపకు, రవితేజ చెట్టుకు వాయిస్ ఓవర్ ఇచ్చి క్రేజ్ పెంచారు.

loader