ప్రయోగాలకు పెద్ద పీట వేస్తున్నాడు నేచురల్ స్టార్ నాని. ఎక్కువగా డిఫరెంట్ కథలు, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఉన్న సినిమాలు  ఎంచుకుంటున్నాడు. అందులో భాగంగానే కొత్త దర్శకులతో పనిచేస్తున్నాడు


నేచురల్ స్టార్ నాని ఈమధ్య ప్రయోగాలకు పెద్ద పీట వేస్తున్నాడు. ఎక్కువగా డిఫరెంట్ కథలు, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఉన్న సినిమాలు ఎంచుకుంటున్నాడు. అందులో భాగంగానే కొత్త దర్శకులతో పనిచేస్తున్నాడు, అంతే కాదు తనకు ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్ అయినా సరే విజన్ ఉంటే నమ్మకంతో వారికి అవకాశం ఇస్తున్నాడు. తాజాగా నానీ అదే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. 

ఈ ఏడాది కొత్త కుర్రాడు అయినా.. శ్రీకాంత్ ఓదేలు కి అవకాశం ఇచ్చాడు అతని పనితనం నచ్చి.. నమ్మకంతో సినిమా చేశాడు. అనుకున్నట్టుగాదే దసరా సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇక అంతకు ముందు కొన్ని ప్లాప్ లు ఫేస్ చేస్తూ వచ్చాడు నాని. అందులో అంటే సుందరానికీ కూడా ఒకటి ఇది ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తొలి రోజే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా పబ్లిసిటీ ఖర్చులు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. 

అసలు ఈసినిమా చాలా బాగుంటుంది. స్టోరీ కాని.. స్క్రీన్ ప్లే కాని యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది. ఎప్పుడూ మూస సినిమాలు చూసిన విసిగిపోయిన వారికి కాస్త ఫ్రెష్ గా కూడా అనిపించింది. కాని సినిమా ఎందుకు ప్లాప్ అయ్యిందో మాత్రం ఎవరికీ అంతు పట్టని విషయం. అయితే ఈ అభిప్రాయం నానీకి కూడా ఉన్నట్టు ఉంది. అందుకే ఈసినిమా డైరెక్టర్ పై ఉన్న నమ్మకంతో మరోసారి అవకాశం ఇవ్వబోతున్నాడట నేచురల్ స్టార్. 

ఈసినిమాను డైరెక్ట్ చేసింద వివేక్ ఆత్రేయ. దసర సినిమాతో మంచి ఊపు మీద ఉన్న నాని.. ప్రస్తుతం చేస్తున్న తన 30వ సినిమాను సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నాడు. ఈసినిమా కూడా శౌర్యవ్ అనే కొత్త కుర్రాడి డైరెక్షన్ లో నటిస్తున్నాడు నాని. ఇక అదే నమ్మకంతో వివేక్ తో కూడా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక 30 వ సినిమా పూర్తి కాగానే వివేక్ తో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్నాయట.రేపో మాపో అనౌన్స్ మెంటె వచ్చి..సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినికొమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ను దర్శకుడు వివేక్ ఆత్రేయా తెలిపాడు. 

ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కబోతున్నట్లు వెల్లడించాడు దర్శకుడు. ఇప్పటి వరకు వివేక్ నుంచి ఇలాంటి జోనర్లో సినిమా రాలేదు. క్లాస్ పేరున్న వివేక్ మాస్ కథను హ్యాండిల్ చేస్తాడా అనే డౌట్ కూడా చాలా మందిలో ఉంది. ఇక దసరాతో నాని తిరుగులేని కంబ్యాక్ ఇచ్చాడు. రూరల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ రా యాక్షన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టింది. నానిని వంద కోట్ల క్లబ్ లో నిలబెట్టింది.