నేచుర‌ల్ స్టార్ నాని 'కృష్ణార్జున యుద్ధం' రిలీజ్ డేట్ ఫిక్స్

natural star nani krishnarjuna yuddham
Highlights

  • నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న కృష్ణార్జున యుద్ధం
  • మేర్లపాక దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో అనుపమ, రుక్సర్
  • ప్రస్థుతం ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ చేస్తున్న ఈ మూవీ విడుదల తేదీ ఖరారు

 

`ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం నుండి రీసెంట్‌గా విడుద‌లైన `ఎంసీఏ` వ‌ర‌కు ఎనిమిది వ‌రుస స‌క్సెస్‌ఫుల్ చిత్రాలతో మెప్పిస్తున్న నేచర‌ల్ స్టార్ నాని హీరోగా ద్విపాత్రాభిన‌యంలో న‌టిస్తున్న చిత్రం `కృష్ణార్జున యుద్ధం`. వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి స‌మ‌ర్ప‌ణ‌లో షైన్ స్క్రీన్స్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  `వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌`, `ఎక్స్‌ప్రెస్ రాజా` చిత్రాల ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. అనుపమ పరమేశ్వరన్ మరియు రుఖ్సార్ మీర్ ఈ చిత్రం లో నాయికలు గా నటిస్తున్నారు.

 

ఈ సినిమా రెండు షెడ్యూల్స్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం ఫైన‌ల్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. ఇందులో  కీల‌క‌మైన స‌న్నివేశాలను  చిత్రీక‌రిస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స‌హా అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 12న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి హిప్ హాప్ త‌మిళ సంగీతాన్ని అందిస్తుండ‌గా, కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

loader