శ్యామ్ సింగరాయ సూపర్ సక్సెస్ తో నేచురల్ స్టార్ నానీకి మళ్ళీ ఊపొచ్చింది. వరుస ఫెయిల్యూర్స్ చూసిన నాని... సక్సెస్ టేస్ట్ తగలడంతో..మళ్ళీ జోరు పెంచాడు. న్యూ ఇయర్ కు ట్రీట్ ఇవ్వబోతున్నాడు.
నేచురల్ స్టార్ నానికి జెర్సి హిట్ పడిన తరువాత వరుసగా ఫెయిల్యూర్స్ ఎదురయ్యాయి. అయినా సరే స్ట్రాంగ్ గా నిలబడి.. సినిమాలు చేసుకుంటూ పోయాడు యంగ్ హీరో. మంచి సినిమా తగిలితే.. ఆ బాధంతా మటుమాయం అవుతుందన్న ఆశతో.. సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన శ్యామ్ సింగరాయ్ తో నానీకి ఊరట లభించింది.మంచి సక్సెస్ అందుకున్న నానీ.. శ్యామ్ సింగరాయ్ తో మంచి కలెక్షన్స్ కూడా సాధిస్తున్నాడు 2021 లో సినిమా రిలీజ్ చేయడం కొంతమంది స్టార్ హీరోలకు కూడా సాధ్యం కాలేదు. కాని నాని ధైర్యం చేసి సక్సెస్ బోర్డ్ మెడలో వేసుకున్నాడు.
ఇక శ్యామ్ సింగరాయ్ ఇచ్చిన జోష్ లో దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్. తన నెక్ట్స్ సినిమాలపై గట్టిగా ఫోకస్ పెట్టాడు. ఈ సక్సెస్ మ్యానియా తగ్గేలోపే.. అదే ఊపులో తన నెక్ట్స్ సినిమాలు కూడా ఆడియన్స్ కు కనెక్ట్ చేసే పనిలో పడ్డాడు నానీ.అందుకే..తన తరువాతి సినిమా అంటే.. సుందరానికి అప్ డేట్ తో రాబోతున్నాడు. న్యూ ఇయర్ గిఫ్ట్ గా అంటే సుందరానికి మూవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాలో తన పాత్రను పరిచయం చేసుకోబోతున్నాడు నానీ.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తున్నాడు. నజ్రియానజిమ్ నానీ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో కె.పి.వి.ఎస్.ఎస్.పి.ఆర్ సుందర్ ప్రసాద్ గా నానీ నటిస్తున్నారు. ఈ సుందర ప్రసాద్ లుక్ నే ఫస్ట్ లుక్ ద్వారా పరిచయం చేయబోతున్నారు మూవీ టీమ్. సినిమాకు సంబంధించిన అప్ డేట్ ను వరుసగా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు టీమ్. శ్యామ్ సింగరాయ్ మాదిరిగా ప్రమోషన్స్ ను కూడా ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
నాని మూస ధోరణి నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాడు. వరుసగా ఒకే తరహా పాత్రల్లో కనిపించిన నానీ... శ్యామ్ సింగరాయ్ తో వేరియేషన్ చూపించాడు. డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించాడు. ఇప్పుడు అంటే సుందరానికి సినిమాలో కూడా అలాంటి పాత్రలోనే కనిపించబోతున్నాడు నేచురల్ స్టార్. పోస్టర్స్ చూస్తే.. పంచెకట్టుతో.. సరికొత్త అవతారంలో నానీ కనిపంచబోతున్నట్టు తెలుస్తోంది. మరి శ్యామ్ సింగరాయ్ మాదిరిగానే అంటే సుందరానికి మూవీ కూడా నానికి సూపర్ సక్సెస్ ఇస్తుందా లేదా చూడాలి.
