ఇవ్వకుండా ఉండలేకపోయాం.. నాని 30 నుంచి సాలిడ్ అప్ డేట్.. నేచురల్ స్టార్ ప్లానింగ్ మామూలుగా లేదుగా..?
సూపర్ ఫాస్ట్ గా షూటింగ్స్ కంప్లీట్ చేస్తున్నాడు నేచురల్ స్టార్ నాని. ఏమాత్రం తగ్గేది లేదు అంటున్నాడు. తన 30వ సినిమాను పరుగులు పెట్టిస్తున్న నేచురల్ స్టార్.. ఈమూవీ నుంచి సాలిడ్ అప్ డేట్ ను ఫ్యాన్స్ కు అందించాడు.
కెరీర్ లో దూకుడు చూపిస్తున్నాడు నేచురల్ స్టార్ నాని. మంచి కమర్షియల్ హిట్.. తో పాటు..మంచి కథ ఉన్న సినిమా చేయాలి అన్న ఆశ.. నాకికి దసరాసినిమాతో తీరిపోయింది. దాంతో అదే ఊపుతో నెక్ట్స్ సినిమాలపై కూడా గట్టిగా గురిపెట్టాడు నాని. శ్యామ్ సింగరాయ్ తరువాత నానికి సాలిడ్ సక్సెస్ లేదు. దసరాతో ఆ కోరిక తీరడంతో.. ఇదే ఊపును కంటీన్యూ చేసి.. వరుసగా సక్సెస్ లు సాధించాలని ప్లాన్ చేస్తున్నాడు నాని. దసరా సినిమాలాగనే ఫార్ములాను ఆలోచించి నెక్ట్స్ హిట్ పై కన్నేశాడు నాని.
దసరా సినిమా ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది. ఫస్ట్ వీకెండ్‌లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆరు రోజుల్లో వంద కోట్ల క్లబ్‌లో నిలిచింది. ఇక సక్సెస్ ఉంటే చాలు అనుకున్న నానికి సెన్సేషనల్ హిట్ దొరికింది. అంతే కాదు ఈ సినిమాతో నాని వంద కోట్ల హీరోగా మారాడు. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో తన తదుపరి సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.
ప్రస్తుతం నాని శౌర్యువ్ అనే కొత్త దర్శకుడితో తన 30వ సినిమా చేస్తున్నాడు. ఓ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయ్యి.. పరుగులు పెడుతోంది. ఇక తాజాగా నాని టీమ్ ముంబయ్ లో సినిమాలోని మేజర్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నారు. అంతకు ముందు కూడా గోవాలో షూటింగ్ చేసుకుని వచ్చారు టీమ్. ఇక నెక్ట్స్ షెడ్యూల్ కోసం కూనూర్ వెల్లబోతున్నారు టీమ్. ఇక తాజాగా నానీ సినిమా నుంచి సాలిడ్ అప్ డేట్ కూడా ఇచ్చారు మేకర్స్.
ముంబయ్ లో షూటింగ్ అయిపోయింది. ఇక కూనూర్ వెళ్లాలి. ఈ విషయాన్ని సింబాలిక్ గా వీడియో రూపంలో చూపించారు మేకర్స్. అంతే కాదు ముంబయ్ లో షూటింగ్ సక్సెస్ ఫుల్ గా సాగినందకు థ్యాంక్యూ ముంబయ్ అంటూ నోట్ కూడా రాశారు. వైరా ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తుండగా.. ఈ సాలిడ్ అప్ డేట్ ను వారు అభిమానులతో పంచుకున్నారు. మీతో త్వరలో ఓ మ్యాజిక్‌ను షేర్ చేసుకునేందుకు వెయిట్ చేయలేకపోతున్నాం.. అంటూ వైరా ఎంటర్ టైన్‌మెంట్స్ ట్వీట్ చేసింది. కూనూర్ షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నట్టు కూడా పోస్టర్ ద్వారా తెలియజేశారు. ముంబై తీర ప్రాంతంలో నాని నడుచుకుంటూ వెళ్తున్న విజువల్స్ వీడియోను వారు పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈసినిమాలో నాని జంటగా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటిస్తోంది.