పెళ్ళంటే అది నయన్ తోనే.. లేకపోతే!

natti nataraj tweet on nayantara's kolamavu kokila
Highlights

దక్షినాది స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న నటి నయనతార ప్రస్తుతం తమిళంలో

దక్షినాది స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న నటి నయనతార ప్రస్తుతం తమిళంలో 'కోలమావు కోకిల' అనే సినిమాలో నటిస్తోంది. దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో పాటను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. 'కళ్యాణ వయసు' అంటూ సాగే ఈ పాటకు విశేష ప్రేక్షకాదరణ దక్కుతోంది.

ఈ పాట విన్న నయన్ బాయ్ ఫ్రెండ్ 'నాకు పెళ్లి వయసొచ్చింది.. నీకోసం ఎదురు చూడమంటావా'అంటూ పాటలోని లిరిక్స్ ను తన భావంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాజాగా మరో నటుడు ఈ పాట విని తను కేవలం నయనతారను మాత్రమే పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు.

ఇంతకీ అతడు ఎవరు అనుకుంటున్నారా..? నటుడిగా, సినిమాటోగ్రాఫర్ గా పలు సినిమాలకు పని చేసిన నట్టి నటరాజ్. ''నేను కేవలం 'కోలమావు కోకిల'ను మాత్రమే పెళ్లి చేసుకుంటానని అది కుదరకపోతే ఆమెను పెళ్లి చేసుకున్న వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇస్తానని'' ట్వీట్ చేశారు. కోలమావు కోకిల అంటే  సినిమాలో నయనతార అని.. మరి ఈ ట్వీట్ పై నయన్ స్పందిస్తుందేమో చూడాలి!  

loader