నిఖిల్ ముద్ర టైటిల్ వివాదం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. నిర్మాత నట్టికుమార్ నిఖిల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నిఖిల్ క్షమాపణ చెప్పకపోతే అతని బండారం బయపెడతామని అన్ని తేలేవరకు నిఖిల్ సినిమాను ఆపేయాలని నట్టి కుమార్ మాట్లాడటం సినిమా ఇండస్ట్రీలో చర్చనీయాశంగా మారింది. 

రీసెంట్ గా ముద్ర టైటిల్ కాపీ విషయంలో నిఖిల్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. సేమ్ లోగోతో తన సినిమా పేరును వాడుకొని టికెట్స్ కూడా పలు యాప్ లో అమ్ముతున్నట్లు చెబుతూ ఆ సినిమాను ఎవరు చూడవద్దని తమ సినిమా ఇప్పుడు రిలీజ్ కావడం లేదని అన్నారు. అలాగే వారిపై చర్యలు తీసుకునేందుకు మా నిర్మాతలు సిద్దమవుతున్నట్లు పేర్కొన్నాడు. అయితే ఇదే విషయంపై నట్టి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ముద్ర టైటిల్ తనదని నిరూపించడానికి అన్ని అధరాలు ఉన్నాయని నిఖిల్ చేసిన వ్యాఖ్యలకు గాను వెంటనే క్షమాపణలని చెప్పాలని అన్నారు. లేకుంటే అతని అసలు బండారాన్ని బయటపెడతామని నట్టి కుమార్ ఛాలెంజ్ విసిరారు.  ఒక సినిమాను చూడవద్దని ఎలా చెబుతారని ఈ విషయంపై ఎమర్జెన్సీ మీటింగ్ పెడుతున్నట్లు చెబుతూ అన్ని తేలేవరకు సినిమాను ఆపేయాలని నిఖిల్ కు సూచించారు. 

అదే విధంగా నిఖిల్ ముద్ర టైటిల్ తనది అని నిరూపించాలని లేకుండా సినిమాల నుంచి తప్పుకోవాలని సవాల్ విసిరారు. నట్టి కుమార్ నిర్మిస్తున్న ముద్ర సినిమాలో జగపతి బాబు హీరోగా నటిస్తున్నారు. ఇది నిఖిల్ సినిమా అనుకుని పలువురు సినిమా టికెట్స్ ను ఆన్లైన్ లో కొనుగోలు చేసుకోవడంతో నిఖిల్ తన వివరణణ ఇచ్చాడు. 

"