సారాంశం
దళపతి విజయ్ నటించిన సినిమా లియో (Leo Vijay Movie). 'విక్రమ్' విజయం తర్వాత లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహించిన చిత్రమిది.
తమిళంతోపాటు పాన్ ఇండియా లెవల్లో ఇప్పుడు లోకేష్ కనగరాజ్ టాప్ డైరెక్టర్లలో ఒకడు గా ఎదిగిన సంగతి తెలిసిందే . గతేడాది కమల్ తో చేసిన విక్రమ్ సినిమాతో ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. దాంతో విజయ్ దళపతి, లోకేష్ కనగరాజ్ లాంటి క్రేజీ కాంబినేషన్ లో వస్తోన్న భారీ చిత్రం లియో పై అంచనాలు ఏ రేంజిలో ఉంటాయో ఊహించుకోవచ్చు . మరీ ముఖ్యంగా అనిరుధ్ మ్యూజిక్ అందించటం కూడా బజ్ ని రెట్టింపు చేసింది. అక్టోబర్ 19న ఈ లియో మూవీ రిలీజ్ కానుంది. దాంతో ఖచ్చితంగా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. అయితే ఇదే సమయంలో ఈ సినిమాలో నార్త్ లో హిందీ వెర్షన్ అదే రోజు రిలీజ్ కాకపోవచ్చు అని వార్త బయిటకు వచ్చింది.
అందుకు కారణం నార్త్ లో అనుసరిస్తున్న OTT ఎగ్రిమెంట్ విధానం. హిందీ బెల్ట్ లో ఏ సినిమా అయినా రిలీజ్ అయిన ఎనిమిది వారాల తర్వాతే OTT రిలీజ్ అని ఎగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంది. ఎనిమిది వారాల గ్యాప్ లేకుండా ఏ సినిమా హిందీ లో రిలీజ్ కాకూడదనేది రూల్. దీన్ని అతిక్రమించటానికి వీల్లేదు. ముఖ్యంగా ఈ రూల్ ని ఖచ్చితంగా PVR/Inox/Cinepolis నేషనల్ ఛైన్స్ వారు ఫాలో అవుతున్నారు. ఇక #Leo రైట్స్ ని నెట్ ప్లిక్స్ వారు నాలుగు వారాల్లో ఓటిటిలో వచ్చేలా ఎగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దాంతో ప్రస్తుతం డిస్కషన్స్ నడుస్తున్నాయి. జైలర్ కు ఇదే సమస్య వచ్చింది. అయితే హిందీ బెల్ట్ నుంచి మంచి ఆదాయం వస్తోంది. ఇంతకు ముందు విక్రమ్ చిత్రానికి ఇరవై కోట్లు దాకా వచ్చినట్లు సమాచారం. దాంతో ఈ సమస్యను ఎలా అధిగమించాలా అని నిర్మత ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.
'లియో' చిత్రాన్ని సెవెన్ స్కీన్స్ పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళానిసామి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిషతో పాటు తెలుగులో 'లీడర్' సహా కొన్ని సినిమాలు చేసిన హీరోయిన్ ప్రియా ఆనంద్ కీలక పాత్ర చేశారు. ఇంకా బాలీవుడ్ స్టార్, 'కెజియఫ్'తో విలన్ గా దక్షిణాది ప్రేక్షకుల్లోనూ గుర్తింపు తెచ్చుకున్న హిందీ హీరో సంజయ్ దత్ ఓ పాత్రలో నటించారు. యాక్షన్ కింగ్ అర్జున్, తమిళ దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, నటుడు మన్సూర్ అలీ ఖాన్, మలయాళ నటుడు మాథ్యూ తదితరులు ఉన్నారు. ఈ సినిమాకు ఛాయాగ్రహణం : మనోజ్ పరమహంస, కూర్పు : ఫిలోమిన్ రాజ్, కళ : ఎన్. సతీష్ కుమార, యాక్షన్ : అన్బరివ్.