బాబీ సింహా హీరోగా నటిస్తున్న చిత్రం `వసంత కోకిల`. నాలభై ఏళ్ల క్రితం కమల్‌ హాసన్‌, శ్రీదేవి నటించిన సూపర్‌ హిట్‌ టైటిల్‌ `వసంతకోకిల` తో ఈ సినిమా రూపొందుతుండటంతో ఆసక్తి నెలకొంది. 

జాతీయ అవార్డు నటుడు బాబీ సింహా హీరోగా నటిస్తున్న చిత్రం `వసంత కోకిల`. నాలభై ఏళ్ల క్రితం కమల్‌ హాసన్‌, శ్రీదేవి నటించిన సూపర్‌ హిట్‌ టైటిల్‌ `వసంతకోకిల` తో ఈ సినిమా రూపొందుతుండటంతో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌, సాంగ్స్ ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఇందులో బాబీ సింహా సరసన కాశ్మీర హీరోయిన్‌గా నటిస్తుంది. రమణన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎమ్‌ఎఫ్‌ఎఫ్‌ పతాకాలపై సినిమా రూపొందుతుంది. తెలుగులో రామ్‌ తాలూరి నిర్మిస్తున్నారు. 

తెలుగు, తమిళం, కన్నడలో రూపొందుతున్న చిత్రమిది. తాజాగా టీజర్‌ విడుదలైంది. `నీటిలో స్పృహ లేకుండా ఉన్న బాబీసింహా కోసం అమ్మాయి వస్తుంది. ఆయన్ని చూసి తన నోటితో, బాబీసింహా నోటిలోకి గాలిగా గట్టిగా ఊదడంతో కళ్లు తెరుస్తాడు. దీంతో అతనికి గతం రివీల్‌ అవుతుంది. గతంలో ఆయన ప్రేమ, ఆ ప్రేమ కోసం పోరాటం వంటి సన్నివేశాలతో ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా సాగుతుందని తాజా టీజర్‌ చెబుతుంది. అద్భుతమైన ఆర్‌ఆర్‌తో టీజర్‌ గూస్‌బమ్స్ తెప్పిస్తుంది.

YouTube video player