ఈ పాట‌కు క్రికెటర్లు, కొరియోగ్రాఫ‌ర్లు, స్టార్ సెల‌బ్రిటీలు డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి హంగామా క్రియేట్  చేసారు. తాజాగా ఇదే పాట మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది.ఈ సారి బాలీవుడ్ హాట్ బ్యూటీ విద్యాబాల‌న్ (Vidya Balan) శ్రీవ‌ల్లి హిందీ పాట‌కు అదిరిపోయే డ్యాన్స్ చేసింది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప – ది రైజ్’ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. తెలుగులోనే కాకుండా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా ఘన విజయాన్ని అందుకుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్ పాత్రలో పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వగా, టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు అదిరిపోయే సంగీతాన్ని అందించాడు. ఇక పుష్ప లోని చూపే బంగార‌మాయెనే శ్రీవ‌ల్లి (Srivalli Song) సాంగ్ ఓ ఊపు ఊపి,సినిమాను నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లింది.

అల్లు అర్జున్, ర‌ష్మిక కలిసి ఈ శ్రీవ‌ల్లి పాట‌కు వేసిన స్టెప్పులకు అందరూ ఎట్రాక్ట్ అయ్యిపోయారు. అంతటా ఈ పాట హోరే వినిపించింది. ఈ పాట‌కు క్రికెటర్లు, కొరియోగ్రాఫ‌ర్లు, స్టార్ సెల‌బ్రిటీలు డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి హంగామా క్రియేట్ చేసారు. తాజాగా ఇదే పాట మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది.ఈ సారి బాలీవుడ్ హాట్ బ్యూటీ విద్యాబాల‌న్ (Vidya Balan) శ్రీవ‌ల్లి హిందీ పాట‌కు అదిరిపోయే డ్యాన్స్ చేసింది.

ప్రస్తుతం విద్యా బాలన్ వేసిన శ్రీవల్లి స్టెప్స్ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కంప్లీట్ బ్లాక్ అవుట్‌ఫిట్‌లో స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని శ్రీవ‌ల్లి సాంగ్‌కు డ్యాన్స్ చేసి కేక పెట్టించింది. ఆమె అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తూ పుష్ప చిత్రం క్రేజ్‌ను మరోసారి వైరల్ చేసే పనిలో ఉన్నారు. పుష్ప మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవీ శ్రీ ప్ర‌సాద్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాడు. విద్యాబాల‌న్‌ ప్ర‌స్తుతం ల‌వ‌ర్స్ సినిమాలో న‌టిస్తోంది. ఇటీవ‌లే ఈ భామ న‌టించిన జ‌ల్సా సినిమా ఓటీటీలో విడుద‌లైంది.