నందమూరి కళ్యాణ్ రామ్ చాలా రోజుల తర్వాత పరాజయాల నుంచి బయటపడ్డాడు. ఈ ఏడాది విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ 118 కళ్యాణ్ రామ్ కు మంచి విజయాన్ని అందించింది. దీనితో కళ్యాణ్ రామ్ ఇకపై విభిన్నమైన కథలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఫిక్సయ్యాడు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఎంత మంచివాడవురా అనే చిత్రంలో నటిస్తున్నాడు. 

ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది. యంగ్ బ్యూటీ నటాషా దోషి ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ లో మెరవనుందట. ఈ సాంగ్ మాస్ ప్రేక్షకులని మెప్పించేలా నటాషా అందాలు ఆరబోయనునట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 

బాలయ్య హిట్ మూవీ జైసింహా చిత్రం ద్వారానే నటాషా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో నటాషా ఓ హీరోయిన్ గా నటించింది. ఇక కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా చిత్రాన్ని ఆదిత్య మ్యూజిక్ సంస్థ నిర్మిస్తోంది. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది.