ఇదొక రకం సినిమా రివ్వ్యూ. సలీమ్ మార్క్ రివ్యూ
ఈ సినిమా చూశాకా..
ముందు భయమేసింది. తర్వాత ఆశ్చర్యం వేసింది..
ఆ తర్వాత తెలుగు సినిమా పై జాలేసింది
కొంచెం తర్వాత నా మీద నాకే కోపం వచ్చింది..
మరి కొంచెం తర్వాత ఆకలేసింది (దాదాపు 3 గంటల యాతన కదా?)
ఇంకొంచెం తర్వాత తెలుగు (సినిమా) అంటేనే చికాకేసింది
మరో తర్వాత టీ.వీ లో "జబర్దస్త్" (పొరపాట్న)
చూసి అసహ్యమేసింది..
కాని వెంటనే పోయింది! ఎందుకంటే....
మళ్ళీ తర్వాత సోనీ మిక్స్ లో
కిశొర్ కుమార్ పాట విని మనసు నిమ్మళించింది!
వణ్ణం తిన్నాక కడుపూ శాంతించింది!
చాలా తర్వాత రివ్యూ రాయాలనిపించింది..
బాగా తర్వాత తెలివొచ్చింది...వద్దనిపించింది
....
నేను కృష్ణవంశీ గారి సినిమాలు
దాదాపుగా అన్ని చూశాను.(కృష్ణవంశీ గారి ఖడ్గం
రివ్యూ నేను రాశాను)
ఇతరా సినిమాల రివ్యూలు కూడా ఎన్నో
రాశాను. ఈ సినిమాకు
రివ్యూ రాయలేక పోతున్నా... అర్థం చేస్కోండి!!!
పి.ఎస్: ప్రగ్యా జైస్వాల్ - రెజీనా
వల్ల ఈ సినిమా హిట్ అవుతుందా?
అయితే అంతకన్నా దారుణం ఉండదు !
ఇంతకూ ఇది కృష్ణవంశీ తీసిన సినిమానేనా??
