ఆస్కార్ రేంజ్ కి వెళ్లిన ఎన్టీఆర్ అన్నతో చిన్న పిల్లాడిని ఎందుకు పోల్చడం.. బావ మరిది ఏం చెప్పాడంటే..
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగ వంశీ స్టార్ హీరోల చిత్రాలతో పాటు మీడియం రేంజ్ చిత్రాలు కూడా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్, త్రివిక్రమ్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన లేటెస్ట్ మూవీ మ్యాడ్.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగ వంశీ స్టార్ హీరోల చిత్రాలతో పాటు మీడియం రేంజ్ చిత్రాలు కూడా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్, త్రివిక్రమ్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన లేటెస్ట్ మూవీ మ్యాడ్. అక్టోబర్ 6న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో నాగ వంశీ ప్రచార కార్యక్రమాలు జోరుగా నిర్వహిస్తున్నారు.
ఈ చిత్రంలో జూ.ఎన్టీఆర్ బావమరిది, లక్ష్మి ప్రణతి తమ్ముడు నార్నె నితిన్ హీరోగా నటిస్తున్నాడు. తాజగా నిర్వహించిన మీడియా సమావేశంలో నార్నె నితిన్ కి ఎన్టీఆర్ గురించి ప్రశ్న ఎదురైంది. మీ బావ ఎన్టీఆర్ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఎన్టీఆర్ ని ఏ విధంగా ఆదర్శంగా తీసుకున్నారు అని అడిగారు.
దీనికి నితిన్ ఆసక్తికరంగా బదులిచ్చారు. తనకి చిన్నప్పటినుంచి నటన అంటే ఆసక్తి ఉందని నితిన్ తెలిపాడు. అక్కకి పెళ్లయ్యాయిక బావ ఎన్టీఆర్ గారిని దగ్గరగా చూడడంతో ఆ ఇష్టం పెరుగుతూ వచ్చింది. ఈ రోజు ఇలా మీ ముందు ఉన్నా అని తెలిపాడు.
ఇక ఎన్టీఆర్ గారి నుంచి నేర్చుకోవాలంటే ఒకటి రెండు కాదు పది విషయాలు ఏడాది మొత్తం నేర్చుకున్నా సరిపోదు అని తెలిపాడు. ఇంతలో మైక్ అందుకున్న నాగ వంశీ.. ఆస్కార్ రేంజ్ కి వెళ్లిన ఎన్టీఆర్ అన్నతో చిన్న పిల్లాడిని ఎందుకు పోల్చడం. ఆయన గురించి నితిన్ ని ఎందుకు అడగడం అని అన్నారు. దీనితో పీఆర్వో సురేష్ కొండేటి.. ఎన్టీఆర్ ఆస్కార్ రేంజ్ కి వెళ్లారు కాబట్టే.. ఎలా ఆదర్శంగా తీసుకున్నారు అని అడిగాను అని అన్నారు.