ఈ సందర్భంగా నవీన్‌ ఎమోషనల్‌ అయ్యారు.  మూడు ఏళ్ల క్రితం ఈ స్టేజీ ఎక్కుతానో, లేదో అని డౌట్‌ లో ఉన్న రోజులు గుర్తుకొస్తున్నాయి. ఆ ఏడాది నా జీవితంలో చాలా కోల్పోయానని తెలిపారు.

సీనియర్‌ నటుడు నరేష్‌ హీరోగా రాణించారు. ఎన్నో కామెడీ సినిమాలు చేసి మెప్పించాడు. ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు పవిత్ర లోకేష్‌తో సహజీవనం చేస్తూ వార్తల్లో, వివాదాల్లో నిలుస్తున్నారు. ఆయన కుమారుడు నవీన్ విజయ్‌ కృష్ణ మాత్రం హీరోగా రాణించలేకపోయారు. ఆయన హీరోగా పరిచయం అవుతూ నటించిన తొలి చిత్రం విడుదల కాలేదు. ఆ తర్వాత `నందిని నర్సింగ్‌ హోమ్‌` మూవీతో మెప్పించారు. ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యాడు. 

కానీ సడెన్‌గా మంగళవారం మీడియా ముందు కనిపించి షాకిచ్చాడు. బాగా బరువు పెరిగి గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. అయితే డైరెక్షన్‌ వైపు ఆయన ఫోకస్‌ పెట్టాడు. యాక్టింగ్‌ మానేసి తాను డైరెక్షన్‌ చేయబోతున్నట్టు తెలిపారు. అంతేకాదు సాయిధరమ్‌ తేజ్‌తో కలిసి `సత్య` పేరుతో ఓ షార్ట్ ఫిల్మ్ రూపొందించారు. సైనికుల భార్యల మనోగతాన్ని ఆవిష్కరించే మూవీ ఇది. మంగళవారం `సోల్‌ ఆఫ్‌ సత్య` పేరుతో ఓ థీమ్‌ సాంగ్‌ని విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు నవీన్‌ విజయ్‌ కృష్ణ. 

తాను యాక్టింగ్‌లోకి వచ్చి తప్పు చేశానని తెలిపారు. నానమ్మ విజయ నిర్మల కోరిక మేరకు తాను హీరో అయ్యానని, కానీ తనకు యాక్టింగ్‌ అంటే ఇష్టం లేదని తెలిపారు. హీరోగా ఉండాలంటే నిజ జీవితంలోనూ యాక్ట్ చేయాలని, అది తన వల్ల కాదని, హీరో అనేది పెద్ద టఫ్‌ జాబ్‌ అని వెల్లడించారు. టెక్నీషియన్‌ జాబ్‌ చాలా బెటర్‌ అని వెల్లడించారు. తాను ఇకపై డైరెక్షన్‌ చేస్తానని, ఓప్రాజెక్ట్ కి వర్క్ జరుగుతుందని, ఆ వివరాలు తెలియజేస్తానని వెల్లడించారు. 

ఈ సందర్భంగా నవీన్‌ ఎమోషనల్‌ అయ్యారు.  మూడు ఏళ్ల క్రితం ఈ స్టేజీ ఎక్కుతానో, లేదో అని డౌట్‌ లో ఉన్న రోజులు గుర్తుకొస్తున్నాయి. ఆ ఏడాది నా జీవితంలో చాలా కోల్పోయాను. అక్కడి నుంచి మళ్లీ ఇక్కడి వరకు వచ్చాను. నేను మీ అందరి కామెంట్లు చదివాను, ఇంత లావయ్యి మీ ముందుకు తిరిగి వచ్చాను, జీవితంలో ముందుకు వెళ్లడం చాలా ముఖ్యం. నానమ్మ విజయ నిర్మల, అమ్మ నేత్ర వీళ్లిద్దరూ నన్ను మంచి స్థాయిలో చూడాలనుకున్నారు. కానీ వాళ్లు బతికుండగా అది నెరవేర్చలేకపోయాను. అందుకే వెనక్కి వెళ్లకుండా మళ్లీ తిరిగి వచ్చాను, `సత్య` సినిమాతో కమ్‌ బ్యాక్‌ ఇస్తున్నా` అని తెలిపారు. 

నవీన్ ఇంకా చెబుతూ, నాకు మా నానమ్మే స్ఫూర్తి, తను యాక్టింగ్, డైరెక్షన్‌, స్పెషల్‌ ఎఫెక్ట్స్ అన్నీ చూసుకునేది, తను సినిమాలు చేసేటప్పుడు నేను సెట్స్ లో ఉండేవాడిని, అవన్నీ చూసి నాకు డైరెక్టర్‌ కావాలనిపించింది. కానీ తనకు మాత్రం నేను నటుడిని కావాలని ఉండేది. ఆమె కోసం నటుడిగా ఎంట్రీ ఇచ్చాను. జీవితంలో అందరికి కష్టాలుంటాయి. మా అమ్మ, నానమ్మ కూడా ఎన్నో కష్టాలు పడ్డారు. వాళ్లు ఫైటర్స్. వీరిద్దరు నాకెప్పుడూ ఆదర్శం` అని తెలిపారు నవీన్‌.