Asianet News TeluguAsianet News Telugu

నరేష్‌ వ్యాఖ్యలపై శ్రీకాంత్‌ అభ్యంతరం.. రేసింగ్‌కి కాదంటూ సాయిధరమ్‌తేజ్‌ ప్రమాదంపై నరేష్‌ వివరణ

నవీన్‌ విజయ్‌ కృష్ణ, సాయితేజ్‌ రేసింగ్‌కి వెళ్లారని ప్రచారం జరుగుతుంది. దీంతోపాటు నరేష్‌ వ్యాఖ్యలను పలువురు సినీ ప్రముఖులు తప్పు పడుతున్నారు. హీరో శ్రీకాంత్‌, బండ్ల గణేష్‌ ఆయన వ్యాఖ్యలకు కౌంటర్‌గా వీడియోలు పెట్టారు. ఈ టైమ్‌లో సాయితేజ్‌ గురించి అలా పెట్టడంసరికాదని శ్రీకాంత్‌ అన్నారు. 

naresh react on sai dharam tej accident and bandla ganesh srikanth comments
Author
Hyderabad, First Published Sep 11, 2021, 7:34 PM IST

సాయిధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదం టాలీవుడ్‌ని ఉలిక్కిపాటుకి గురిచేస్తుంది. సాయితేజ్‌ త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు. అందులో భాగంగా `మా` అధ్యక్షుడు నరేష్‌ సైతం దీనిపై స్పందించారు. సాయితేజ్‌ తన ఇంటి నుంచే బయలు దేరారని, నవీన్‌తో కలిసి వెళ్లారని తెలిపారు. రేసింగ్‌లకు వెళ్లొద్దని తాను చాలా సార్లు చెప్పానని, వారికి కౌన్సిలింగ్‌ కూడా ఇవ్వాలనుకున్నానని నరేష్‌ తెలిపారు. అయితే నవీన్‌ విజయ్‌ కృష్ణ, సాయితేజ్‌ రేసింగ్‌కి వెళ్లారని ప్రచారం జరుగుతుంది. 

దీంతోపాటు నరేష్‌ వ్యాఖ్యలను పలువురు సినీ ప్రముఖులు తప్పు పడుతున్నారు. హీరో శ్రీకాంత్‌, బండ్ల గణేష్‌ ఆయన వ్యాఖ్యలకు కౌంటర్‌గా వీడియోలు పెట్టారు. ఈ టైమ్‌లో సాయితేజ్‌ గురించి అలా పెట్టడంసరికాదని శ్రీకాంత్‌ అన్నారు. నరేష్‌ వీడియో బైట్‌ని ఆయన తప్పు పట్టారు. సాయితేజ్‌ ఆరోగ్యం బాగుందని, ఆయన కోలుకుంటున్నారని తెలిపారు. 

అయితే దీనిపై వివరణ ఇచ్చాడు నరేష్‌. తాను రేసింగ్‌కి వెళ్లారని చెప్పలేదని తెలిపారు. `సాయిధరమ్‌ తేజ్‌ ఫాస్ట్ గా రికవరి అవుతున్నారు. నేను క్లీయర్‌గా చెప్పాను. వీరిద్దరు కలిసి ఇంటి నుంచి బయలు దేరారు. వీళ్లు ఒక ఛాయ్‌ షాపు ఓపెనింగ్‌కి వెళ్లారు. ఓపెనింగ్‌ పూర్తయిన తర్వాత ఎవరికి వారు వస్తున్నప్పుడు సాయిధరమ్‌ తేజ్‌ సెపరేట్‌గా ఉన్నాడు. ఎవరూ రేస్‌లో లేరు. సాయిధరమ్‌ తేజ్‌ నార్మల్‌ స్పీడ్‌లో ఉన్నాడు. 60-70 కీలోమీటర్ల స్పీడ్‌లో ఉన్నారు. లెఫ్ట్ కి వెళ్లినప్పుడు ఇసుక కారణంగా జారి ఆయనకు ప్రమాదం జరిగింది. ఇది నెగ్లీజెన్స్ కాదు. కేవలం యాక్సిడెంట్‌. పిల్లలు బాగుండాలని కోరుకుంటాం తప్ప మరో ఉద్దేశం లేదు` అని తెలిపారు. 

ప్రస్తుతం సాయితేజ్‌ ట్రీట్‌మెంట్‌కి రెస్పాండ్‌ అవుతున్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు 5 గంటల హెల్త్ బులెటిన్‌లో తెలిపారు. సాయితేజ్‌కి ఇంటర్నల్ గా ఎటువంటి గాయాలు లేవని, చికిత్స కు సహకరిస్తున్నారని అపోలో వైద్యులు తెలిపారు. డాక్టర్ అలోక్ రంజన్ నేతృత్వంలో ట్రీట్‌మెంట్‌ జరుగుతుందని, కాలర్ బోన్ శాస్త్ర చికిత్స చేయాలనేది 24 గంటలు తర్వాత ఆలోచిస్తామ`ని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios