మళ్ళీ పెళ్లంటూ.. ఈమధ్య తెగ హడావిడి చేస్తున్నారు యాక్టర్ నరేష్.. అండ్ పవిత్ర. త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నామంటూ.. తన లైఫ్ స్టోరీని సినిమాగా చేశాడు నరేష్...  ఈమూవీ ప్రీ రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు చేశారు టీమ్. 

ఈమధ్య పవిత్ర లోకేష్ తో కలిసి హడావిడి చేస్తున్నాడు సీనియర్ హీరో.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్. ఎన్నో సినిమాల్లో హీరోగా నటించిన నరేశ్ ఆతువాత చాలా కాలంగా కేరక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయ్యాడు. ఈ మధ్య కాలంలో ఆయన లేని సినిమా అంటూ లేదు. అలాంటి నరేష్.. పవిత్ర లోకేష్ తో కలిసి రచ్చ రచ్చ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ఆమెతో కలిసి స్క్రీన్ పై హడావిడి చేయడానికి రెడీ అయ్యాడు. మళ్లీ పెళ్ళి అంటూ.. ఈఇద్దరు స్టార్లు జంటగా ఓ సినిమా రిలీజ్కు రెడీ అవుతోంది. ప్రస్థుతం ఈ సినిమా సోషల్ మీడియాతో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గామారింది. 

నరేష్ హీరోగా.. పవిత్ర లోకేష్ జంటగా నటిస్తున్నసినిమా.. మళ్లీ పెళ్లి. నరేష్ స్వంగా విజయకృష్ణ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. తన వయసుకి తగిన పాత్రలోనే ఆయన ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఇక సినియర్ నిర్మాత, దర్శకుడు ఎమ్మెస్ రాజు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ మూవీ రిలీజ్ కు ముస్తాబవగా.. రేపు సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదు .. ఫిల్మ్ నగర్లోని జేఆర్సీ కన్వెన్షన్ లో జరిపేందుకు సన్నాహాలు చేశారు. 

ఈ సినిమాలో పవిత్ర లోకేష్, నరేష్ పాత్ర నిజజీవితానికి దగ్గరగా ఉండబోతున్నాయి. ఇక నరేష్ మూడో భార్య పాత్రలో తమిళ సంచలన నటి వనిత విజయ్ కుమార్ నటించారు. కొంతకాలంగా నరేష్ - పవిత్ర లోకేశ్ గురించిన వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరికి కలిసి, తమ జీవితంలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను కలుపుతూ ఈ సినిమా చేయడం ఆసక్తిని రేపుతోంది. ఈ నెల 26వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.