టాలీవుడ్ సీనియర్ హీరోగా నాగార్జునకి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ ట్వీట్ కేవలం నాగార్జునకు మాత్రమే కాదు.. సినీ-రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలకు పీఎం ఆఫీస్ నుండి వచ్చిందని తెలుస్తోంది.

ఇంతకీ ఆయన నాగార్జునకు ఏమని ట్వీట్ చేశారంటే.. ''కొన్నేళ్లుగా ఎన్నో సినిమాల్లో నటించి లక్షలాది మంది అభిమానం పొందారు. అవార్డులు సొంతం  చేసుకున్నారు. అత్యధికంగా అభిమానుల ఫాలోయింగ్ సంపాదించుకున్న మీరు.. ఈ ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో పోలింగ్ జరిగేలా ఓటర్లను చైతన్య పరచాలని కోరుతున్నాను'' అంటూ మోదీ తన ట్వీట్ లో నాగార్జునను అభ్యర్ధించడం ఆసక్తి కలిగిస్తోంది.

ఇదే తరహా ట్వీట్ రిక్వెస్ట్ ని మోహన్ లాల్, అనుష్క, రణవీర్, దీపిక వంటి స్టార్ లకు ప్రధాని మోదీ పంపించారని తెలుస్తోంది.