సారాంశం
టీమిండియా స్టార్ క్రికెటర్, హిట్ మాన్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ కి షాక్ ఇస్తూ అనూహ్యంగా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
టీమిండియా స్టార్ క్రికెటర్, హిట్ మాన్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ కి షాక్ ఇస్తూ అనూహ్యంగా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టెస్టులు, వన్డేలు, టి20 లు ఫార్మాట్ ఏదైనా రోహిత్ శర్మ బ్యాటింగ్ ని క్రికెట్ అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తారు. నిర్భయంగా బౌలర్లపై విరుచుకుపడడం రోహిత్ శర్మ స్టైల్. కెప్టెన్ గా కూడా రోహిత్ శర్మ టీమిండియా కి అనేక విజయాలు, ఐసీసీ ట్రోఫీలు అందించారు.
రోహిత్ శర్మ ఇంస్టాగ్రామ్ వేదికగా తాను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. నేను టెస్టుల నుంచి రిటైర్ అవుతున్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. వైట్ డ్రెస్ లో దేశానికి ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నాను. ఇన్నేళ్ల పాటు మీరందించిన ప్రేమ, సపోర్టుకి ధన్యవాదాలు. వన్డేల్లో కొనసాగుతాను అని రోహిత్ శర్మ తెలిపారు. రోహిత్ శర్మ టెస్టుల నుంచి తప్పుకోవడంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నప్పటికీ అతడికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సెలబ్రిటీల్లో కూడా రోహిత్ శర్మ కి అభిమానులు ఉన్నారు.
రోహిత్ శర్మ టెస్టుల నుంచి రిటైర్ కావడం పట్ల టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆన్ ఫీల్డ్ ఉత్సాహంగా కనిపించే రోహిత్ శర్మని, అతడు ధైర్యంగా ఆడే షాట్లని, బోల్ట్ గా తీసుకునే నిర్ణయాలను ఇకపై టెస్టుల్లో మిస్ అవుతాం. నీకు అద్భుతమైన రిటైర్మెంట్ శుభాకాంక్షలు రోహిత్ శర్మ.. అంటూ నారా రోహిత్ ట్వీట్ చేశారు. నారా రోహిత్ ట్వీట్ కి ఫ్యాన్స్ కూడా స్పందిస్తున్నారు. రోహిత్ శర్మ టెస్టుల నుంచి రిటైర్ కావడం పట్ల హార్ట్ బ్రేక్ ఎమోజిలతో కామెంట్స్ పెడుతున్నారు.
రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్లో 12 ఏళ్ల పాటు కొనసాగారు. తన కెరీర్లో 67 టెస్టులు ఆడిన రోహిత్ శర్మ 4301 పరుగులు సాధించాడు. అందులో 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.