నారా రోహిత్ కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్స్ బాగా తక్కువ. అందులోనూ రీమేక్ కు అర్హమయ్యేవి బాగా తక్కువ. అయితే రిలీజైన ఇంతకాలానికి నారా రోహిత్ కెరీర్ లో హిట్ గా నిలిచిన  ‘అప్పట్లో ఒకడుండేవాడు’కు బాలీవుడ్ రీమేక్ కు రెడీ అవుతున్నట్లు సమాచారం. బాలీవుడ్ కు చెందిన పెద్ద నిర్మాణ సంస్ద ఈ చిత్రం రీమేక్ రైట్స్ తీసుకుందని సమాచారం. ఈ మేరకు అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. అలాగే తెలుగులో డైరక్ట్ చేసిన సాగర్ కె చంద్ర...హిందీలోనూ డైరక్ట్ చేసే అవకాసం ఉంది.
 
నారా రోహిత్, శ్రీ విష్ణు, తాన్యా హోప్‌ ముఖ్య తారలుగా సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో ఆరన్‌ మీడియా వర్క్స్‌ పతాకంపై ప్రశాంతి, కృష్ణ విజయ్‌ నిర్మించిన చిత్రం ‘అప్పట్లో ఒకడుండేవాడు’. ఈ సినిమా 1990లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.

దేశాన్నే వణికించిన ఐదారు అంశాలు ఇందులో ఉంటాయి. ఒక క్రికెటర్, ఓ పోలీసాఫీసర్‌ మధ్య జరిగిన కథే ఈ చిత్రం. ఇందులో క్రికెటర్‌ రైల్వే రాజు పాత్రలో శ్రీ విష్ణు నటించారు. ఉద్యోగం కోసం ఏదైనా చేయడానికి వెనకాడని ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ పాత్రను నారా రోహిత్‌ చేసారు. ఈ సినిమా నటుడిగా నారా రోహిత్ కు  మంచి పేరు తెచ్చిపెట్టింది.  

ఇక ఈ రీమేక్ సినిమా 2021 సమ్మర్ నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాతలు ఈ సినిమాలో నటించే ఇద్దరు హీరోలను ఎంపిక చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. అలాగే బాలీవుడ్ నేటివిటి కు తగ్గట్లు కొన్ని మార్పులు చేర్పులు చోటు చోసుకోబోతున్నాయి. 1990లలో ఉన్న రాజకీయ సామాజిక పరిస్థితులకు అనుగుణంగా కథా రెడీ చేసుకున్న దర్శకుడు, ఆకట్టుకునే కథనంతో సినిమాను నడిపించాడు.