ఆగష్టు 30న విడుదల కాబోతున్న సాహో చిత్రం కోసం దేశం మొత్తం సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రం 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ చిత్రంపై అప్పుడే రాజకీయ వివాదాలు కూడా మొదలయ్యాయి. సాహో విషయంలో వివాదంగా మారుతున్న ఓ అంశం గురించి క్లారిటీ ఇచ్చేందుకు ఏకంగా ఏపీ మాజీ సీఎం తనయుడు నారా లోకేష్ ముందుకు వచ్చారు. 

సాహో చిత్రంపై సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఓ మీడియా సంస్థలో టిడిపి కార్యకర్తలు సాహో చిత్రంపై నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారనే కథనం వెలువడింది. ఈ వార్తపై లోకేష్ మండిపడుతూ ట్వీట్ చేశారు. ఇలాంటి అబద్దపు వార్తలు రాసి ఆ డబ్బుతో కనీసం అన్నం తినగలరా అంటూ లోకేష్ విరుచుకుపడ్డారు. 

అనంతరం సాహో చిత్రం గురించి మాట్లాడాడు. సాహో భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న విజువల్ వండర్ చిత్రం. ఈ చిత్రాన్ని చూసేందుకు నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ చిత్రం ఘనవిజయం కావాలని కోరుకుంటున్నా. టిడిపి కార్యకర్తలు, ప్రభాస్ అభిమానులు అంతా ఈ చిత్రాన్ని చూడాలి. ఇలాంటి అసత్యపు ప్రచారాన్ని పట్టించుకోవద్దు అని నారా లోకేష్ సూచించాడు.