Asianet News TeluguAsianet News Telugu

'అరవింద సమేత' ప్రీరిలీజ్: నాన్నకు ప్రేమతో ఎమోషనల్ శాండ్ ఆర్ట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న నూతన చిత్రం 'అరవింద సమేత వీర రాఘవ'. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ఈషా రెబ్బా, జగపతిబాబు, నాగబాబు కీలకపాత్రల్లో నటించారు.

nannaku prematho sand art at aravinda sametha pre release event
Author
Hyderabad, First Published Oct 2, 2018, 7:28 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న నూతన చిత్రం 'అరవింద సమేత వీర రాఘవ'. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ఈషా రెబ్బా, జగపతిబాబు, నాగబాబు కీలకపాత్రల్లో నటించారు. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు.

యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు.  ఇప్పటికే ఈ వేడుకకు సంగీత దర్శకుడు తమన్, సిరివెన్నెల సీతారామశాస్త్రి, దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత రాధాకృష్ణ చేరుకున్నారు.

ఈ ఈవెంట్ లో భాగంగా ప్రముఖ శాండ్ ఆర్టిస్ట్ వేణు.. ఎన్‌టి‌ఆర్ కెరీర్ లో ప్రేక్షకులకు గుర్తుండిపోయిన కొన్ని చిత్రాలను తన శాండ్ ఆర్ట్ ద్వారా మరోసారి గుర్తుచేశారు. ఆది, సింహాద్రి, రాఖీ, బృందావనం, నాన్నకు ప్రేమతో చివరగా అరవింద సమేత శాండ్ ఆర్ట్ లను వేసి చూపించారు. అయితే నాన్నకు ప్రేమతో శాండ్ ఆర్ట్ అభిమానులను ఎంతగానో ఆకర్షించింది. 

సంబంధిత వార్తలు.. 

'అరవింద సమేత' ప్రీరిలీజ్ హడావిడి.. భారీ ఎత్తున తరలివచ్చిన అభిమానులు!

'అరవింద సమేత' ప్రీరిలీజ్ ఎలా ఉండబోతుందంటే!

'అరవింద సమేత' ప్రీరిలీజ్ ఈవెంట్.. బాలయ్య కనిపించడా..?

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!

అరవింద సమేత.. అసలు కాన్సెప్ట్ ఇదేనట?

 

Follow Us:
Download App:
  • android
  • ios