'అరవింద సమేత' ప్రీరిలీజ్ ఎలా ఉండబోతుందంటే!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న 'అరవింద సమేత' సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు చిత్రబృందం ప్రీరిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేసింది. ప్రస్తుతం దానికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న 'అరవింద సమేత' సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు చిత్రబృందం ప్రీరిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేసింది. ప్రస్తుతం దానికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే ఈ షో ఎలా ఉండబోతుందనే విషయంపై కొన్ని వివరాలు బయటకి వచ్చాయి.
రెండుగంటల పాటు సాగే ఈ ఫంక్షన్ ఎలాంటి హడావిడి, గోల లేకుండా క్లాస్ గా జరుగుతుందని అంటున్నారు. దలేర్ మహెంది, శివమణి, ఆర్మాన్ మాలిక్, కైలాష్ ఖేర్ లైవ్ షో లు వుంటాయి. సిరివెన్నెల, రామజోగయ్య, ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల స్పీచ్ లు స్పెషల్ గా ఉంటాయని చెబుతున్నారు.
మెడ్లీలు, ఎవీల హడావిడి లేకుండా టోటల్ గా ఫంక్షన్ మొత్తం మంచి ఫీల్ ని కలిగించే విధంగా వుంటుదని తెలుస్తోంది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని భారీ బడ్జెట్ తో హారికాహాసిని క్రియేషన్స్ నిర్మాణ సంస్థ రూపొందించింది.
సంబంధిత వార్తలు..
'అరవింద సమేత' ప్రీరిలీజ్ ఈవెంట్.. బాలయ్య కనిపించడా..?
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!
అరవింద సమేత.. అసలు కాన్సెప్ట్ ఇదేనట?