నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘అంటే సుందరానికీ’. శ్యామ్ సింగరాయ్ తర్వాత నాని అభిమానుల ముందుకు రానున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ పై మేకర్స్ తాజాగా అప్డేట్ అందించారు.

టాలీవుడ్ స్టార్ హీరో.. నేచురల్ స్టార్ నాని (Natural star Nani) శ్యామ్ సింగరాయ్ చిత్రం నుంచి తన అభిమానుల కోసం వరుస చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ మేరకు ఎప్పటికప్పుడు తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను అందిస్తున్నారు మేకర్స్. శ్యామ్ సింగరాయ్ విజయవంతం అయిన తర్వాత నాని.. విభిన్న కథలు ఎంచుకుంటూ ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తూ వస్తున్నారు. సింగరాయ్ అనంతరం అదే ఊపులో నాని రెండు సినిమాలకు సైన్ చేశారు. అందులో ఒకటి ‘అంటే సుందరానికీ’ కాగా, రెండోది ‘దసరా’ Dasara. నాని ఇప్పటికే ‘అంటే సుందరానికీ’ చిత్ర షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. ఈ మేరకు మేకర్స్ సినిమాను రిలీజ్ చేసుందుకు సిద్ధంగా ఉన్నారు. 

కాగా, తాజాగా Ante Sundaraniki నుంచి క్రేజీ అప్డేట్ అందించారు మేకర్స్. ఇప్పటి వరకు ఫస్ట్ లుక్స్, గ్లిమ్స్, టీజర్ తో సరిపెట్టిన చిత్ర యూనిట్.. ఇక మ్యూజిక్ షురూ చేయనుంది. ఈ మేరకు ఫస్ట్ సింగిల్ పై అప్డేట్ అందింది. ‘పంచెకట్టు’ టైటిల్ తో ఏప్రిల్ 6:03 నిమిషాలకు ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. వేసవి కాలం సన్నాయి పేరిట ఈ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. అలాగే నాని అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు మైత్రీ మూవీ మేకర్స్ వారు శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. 

అంటే సుందరానికీలో.. నాని సుందర ప్రసాద్ అనే పాత్రలో నటిస్తున్నాడు. నాని సరసన హీరోయిన్ నజ్రియా ఫహద్ (Nazriya Fahad) ఆడిపాడనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తున్నాడు. కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం జులై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం నాని దసరా మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో నాని సరసన హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు.

Scroll to load tweet…