రజనీ కొత్త చిత్రంలో ...ప్రత్యేక పాత్రలో హీరో నాని
రజనీకాంత్ కొత్త చిత్రంలో మన తెలుగు హీరో నాని ప్రత్యేక పాత్రలో కనించబోతున్నారు. ఈ మేరకు మాటలు జరిగి ఎగ్రిమెంట్ అయ్యిందని సమాచారం.

నేచురల్ స్టార్ నాని తను చేసే సినిమా కథలు విభిన్నంగా ఉండేలా చూసుకుంటారు. ఒకదానికొకటి పోలిక లేకుండా సినిమాలు చేస్తూంటారు. రీసెంట్ గా దసరా చిత్రంతో సూపర్ హిట్ కొట్టాడు నాని. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో నాని కెరీర్‌లో మొదటిసారిగా వంద కోట్ల క్లబ్‌లో చేరారు. ప్రస్తుతం తను ‘హాయ్ నాన్న’ చిత్రంలో నటిస్తుండగా.. ఇది తనకు 30వ చిత్రం. ద్వారా శౌర్యవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమాలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్, శ్రుతి హాసన్ ఫిమేల్ లీడ్స్‌లో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమా తర్వాత మరో చిత్రం కమిటయ్యారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త చిత్రంలో మన తెలుగు హీరో నాని ప్రత్యేక పాత్రలో కనించబోతున్నారు. ఈ మేరకు మాటలు జరిగి ఎగ్రిమెంట్ అయ్యిందని సమాచారం. అది గెస్ట్ రోల్ కాదని సినిమా కథను మలుపు తిప్పే పాత్ర అని అంటున్నారు. ఇంతకీ ఏ చిత్రం ఇది..దర్శకుడు ఎవరూ అంటారా...
జైభీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్‌తో రజనీకాంత్ సినిమా చేయబోతున్నాడు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ మధ్యన ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందించబోతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తామని, 2024లో ఈ సినిమాను రిలీజ్ చేస్తామని వెల్లడించారు. ఈ సినిమాలోనే నాని కనిపించనున్నారు. నానిని అడిగిన వెంటనే మరో ఆలోచన చేయకుండా ఒప్పుకున్నట్లు చెన్నై సిని వర్గాలు చెప్తున్నాయి.
సూర్య హీరోగా రూపొందిన జైభీమ్ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు పలు అవార్డులను అందుకున్నది. సమాజంలో అణగారిన వర్గాలకు న్యాయం విషయంలో ఎదురవుతోన్న అసమానతల్ని వాస్తవిక కోణంలో దర్శకుడు ఆవిష్కరించిన తీరుకు ప్రశంసలు దక్కాయి. జైభీమ్ తరహాలోనే సామాజిక సమస్యను చర్చిస్తూ రజనీకాంత్ సినిమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం జైలర్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు రజనీకాంత్. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్వకత్వం వహిస్తోన్నాడు. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, తమన్నా, రమ్యకృష్ణ కీలక పాత్రల్ని పోషిస్తున్నారు.