నటుడు విశ్వక్ సేన్ 'ఫలక్ నుమా దాస్' సినిమాలో నటించడంతో పాటు డైరెక్టర్ గా కూడా వ్యవహరించాడు. అయితే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ స్పీచ్ విజయ్ దేవరకొండని ఉద్దేశించి ఉందని, అతడు కావాలనే విజయ్ ని టార్గెట్ చేశాడంటూ సోషల్ మీడియాలో పెద్ద వార్ నడించింది.

సినిమా రిలీజ్ అయిన తరువాత కూడా కంటిన్యూ  అయింది. దీంతో విశ్వక్ సేన్ బూతులతో విరుచుకుపడ్డాడు. తను ఏ హీరోని ఉద్దేశించి ఆ కామెంట్స్ చేయలేదని క్లారిటీ ఇచ్చినప్పటికీ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మాత్రం అతడిని విడిచిపెట్టడం లేదు. 

అయితే ఈ వివాదం మరింత ముదరడంతో విశ్వక్ సేన్ దురుసుగా ప్రవర్తించాడు. ఒక రకంగా అతడికి బ్యాడ్ బాయ్ ఇమేజ్ వచ్చిందనే చెప్పాలి. దీంతో అతడితో సన్నిహితంగా ఉండే వాళ్లు కూడా దూరంగా ఉంటున్నారని టాక్.

ఇది ఇలా ఉండగా.. 'ఫలక్ నుమా దాస్' సినిమా రిలీజ్ కాకముందే హీరో నాని తన బ్యానర్ లో విశ్వక్ సేన్ తో సినిమా ఉంటుందని అనౌన్స్ చేశాడు. ఇప్పుడు విశ్వక్ సేన్ పై చాలా మందిలో నెగెటివ్ ఫీలింగ్ ఏర్పడడంతో నాని తనతో కలిసి పని చేస్తాడా..? చెప్పినట్లుగా అతడికి ఛాన్స్ ఇస్తాడా..? అనే సందేహాలు నెలకొన్నాయి.