టాలీవుడ్ స్టార్ హీరో నాని కోలీవుడ్ హీరో విశాల్ ఒకే స్క్రీన్ పై కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. దర్శకుడు మహి వి రాఘవ తెలుగు తమిళ్ హీరోలతో కలిసి భారీ మల్టీస్టారర్ కి ప్లాన్ చేస్తున్నట్లు గతంలోనే ఒక టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు దాదాపు కథానాయకులిద్దరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. 

ఇప్పటికే నాని స్టార్ హీరో నాగార్జున తో కలిసి చేసిన దేవ దాస్ పరవాలేధనిపించింది. ఇక మరో మల్టీస్టారర్ లో కూడా నటించే అవకాశం ఉన్నట్లు మొన్నటివరకు వార్తలు వచ్చాయి. ఇక ఫైనల్ గా విశాల్ తో నటించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. పైగా తమిళ్ లో కూడా నాని స్టార్ డమ్ కి తప్పకుండా ఈ మల్టీస్టారర్ ఉపయోగపడనుంది. విశాల్ కి ఇప్పటికే టాలీవుడ్ లో మంచి మార్కెట్ సెట్టయ్యింది. 

ఇప్పుడు నానితో కలిసి నటిస్తే తెలుగులో మరింతగా క్రేజ్ పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం యాత్ర సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న మహి వి రాఘవ త్వరలోనే ఈ మల్టీస్టారర్ పై అధికారికంగా స్పందించే అవకాశం ఉంది. ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి ఈ మల్టీస్టారర్ ను నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అన్ని సెట్టయితే మార్చ్ లోనే ఈ మల్టీస్టారర్ రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం.