ఈ ఏడాది కృష్ణార్జున యుద్ధం తో డిజాస్టర్ అందుకున్న న్యాచురల్ స్టార్ నాని రీసెంట్ గా దేవదాస్ తో కూడా పెద్దగా మెప్పించలేకపోయాడు. అయితే నెక్స్ట్ ఎలాగైనా హిట్ అందుకోవాలని స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న జెర్సీ సినిమా కోసం తెగ కష్టపడుతున్నాడు .

ఇక నుంచి రెగ్యులర్ కథలను పక్కనపెట్టి ప్రయోగాత్మకంగా ఉండే డిఫరెంట్ కథలనే చేయలని నాని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా మనం దర్శకుడు నానితో టచ్ లో ఉంటున్నాడు. అయితే మొదట నానికి చెప్పిన లవ్ ఎంటర్టైనర్ పెద్దగా నచ్చకపోవడంతో విజువల్ ఎఫెక్ట్స్ కు సంబందించిన ఒక కథను నానికి చెప్పాడని సమాచారం.
దీంతో నాని కూడా కథ కొత్తగా అనిపించడం ఈగ సినిమా తరువాత మరో విఎఫ్ఎక్స్ సినిమాల్లో నటించలేదని ఇప్పుడు పుర్తిగా కథలో భాగమయ్యే గ్రాఫిక్స్ సినిమాలో నటించాలని నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక కథలో కొన్ని మార్పులు అవసరం అని దర్శకుడితో చర్చలు జరపడంతో ఫైనల్ స్క్రిప్ట్ పూర్తవ్వగానే త్వరలోనే సినిమాను పట్టాలెక్కించేందుకు ఇరువురు ఒక మాట అనేసుకున్నట్లు టాక్. మరి వీరి సప్సెస్న్ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.