ఆ సినిమాలు చూడాలనివుంది: నాని

First Published 29, Jun 2018, 11:47 AM IST
nani tweet about ee nagaraniki emaindi and sanju movie
Highlights

హీరోగా వరుస సినిమాలు చేస్తూనే మరోపక్క 'బిగ్ బాస్' సీజన్2 కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు 

హీరోగా వరుస సినిమాలు చేస్తూనే మరోపక్క 'బిగ్ బాస్' సీజన్2 కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు నాని. వారం మొత్తం షూటింగ్ లో పాల్గొని మళ్లీ శని, ఆదివారాలు బిగ్ బాస్ షోతో తీరిక లేకుండా గడుపుతున్నాడు. దీంతో అతడికి అసలు టైమ్ దొరకడం లేదంట. కాస్త సమయంలో దొరికితే ఈ వారాంతంలో రెండు సినిమాలు చూడాలని ఆశ పడుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 

'ఈ వీకెండ్ లో 'ఈ నగరానికి ఏమైంది','సంజు' సినిమాలు చూడాలనుకుంటున్నాను. దానికోసం కాస్త సమయం దొరుకుతుందని ఆశిస్తున్నాను' అంటూ ట్వీట్ చేశాడు. నిజానికి ఈ వారంలో 11 సినిమాలు విడుదల కాగా.. ఆడియన్స్ లో మాత్రం ఈ రెండు సినిమాలపైనే ఆసక్తి నెలకొంది. దానికి తగ్గట్లు రెండు సినిమాలకు కూడా పాజిటివ్ టాక్ రావడంతో మరింత క్రేజ్ పెరిగింది. 

 

loader