నిన్న తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అందరికీ ఓ కొత్త కబురు చెప్పబోతున్నానని వెల్లడించాడు హీరో నాని. చెప్పినట్లుగానే ఈరోజు తన కొత్త సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశాడు. ఇక్కడ విశేషమేమిటంటే.. ఓ కొత్త దర్శకుడితో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు నేచురల్ స్టార్. 'మళ్లీరావా' చిత్రంతో టాలీవుడ్ లో దర్శకుడిగా పరిచయమైన గౌతమ్ తిన్ననూరి తన రెండో సినిమాకు హీరోగా నానిని ఫిక్స్ చేసుకున్నాడు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించనున్నారు. దీనికి 'జెర్సీ' అనే టైటిల్ ను ఫైనల్ చేశారు. క్రికెట్ నేపధ్యంలో ఈ సినిమా సాగుతుందని పోస్టర్ ద్వారా వెల్లడించారు. నాని క్యారెక్టర్ పేరు అర్జున్ అనే విషయాన్ని కూడా రివీల్ చేశారు. అప్పుడెప్పుడో.. భీమిలి కబడ్డీ జట్టు సినిమాలో నటించాడు నాని. మళ్లీ ఇన్నాళ్లకు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలో కనిపించబోతున్నాడు. ప్రేమ, క్రికెట్ అనే రెండు విషయాలతో సినిమా సాగుతుంది. 

మరికొద్ది రోజుల్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం నాని హీరోగా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఓ సినిమా రూపొందిస్తున్నాడు. ఇందులో నాగార్జున మరో హీరోగా కనిపించబోతున్నాడు.