ఎంసీఏ సినిమా షూటింగ్ లో బిజీగా నాని విక్రమ్ తో నెక్ట్స్ సినిమా చేయనున్న నాని వచ్చే ఏడాది సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం
విభిన్నమైన కథలను ఎంచుకొని వరుస విజయాలతో దూసుకెళ్తున్న నటుడు నాని. ఇటీవలే ‘నిన్ను కోరి’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం ఎంసీఏ( మిడిల్ క్లాస్ అబ్బాయి) అనే చిత్ర షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా అనంతరం విక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు సమాచారం.
అక్కినేని మూడు తరాలను ఒకే సినిమాలో చూపించిన దర్శకుడు విక్రమ్. మనం సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. సూర్యతో తీసిన 24 సినిమా కూడా తెలుగు, తమిళ ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రస్తుతం విక్రమ్.. అఖిల్ హీరోగా ‘ హలో’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పోస్టర్లు ఇప్పటికే నెట్టింట సందడి చేస్తున్నాయి. అంతటి క్రేజ్ ఉన్న ఈ తమిళ డైరెక్టర్ తో న్యాచురల్ స్టార్ నాని సినిమా చేస్తాడనే ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. విక్రమ్.. నానికి కథ కూడా వినిపించారని టాక్. ఒక వేళ ఇది నిజమైతే వచ్చే ఏడాది ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.
తమిళ దర్శకులతో నాని సినిమాలు చేయడం ఇది తొలిసారేమీ కాదు. గతంలో సముద్రఖని దర్శకత్వంలో ‘ జెండా పై కపిరాజు’ సినిమా చేశారు. మరో దర్శకుడు అంజలి సింఘ్ డైరెక్షన్ లోనూ ఓ చిత్రం చేశారు.
