బిగ్ బాస్ షోలో నాని లుక్!

nani to host big boss show season2
Highlights

ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 1 ప్రేక్షకాదరణ పొందింది

ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 1 ప్రేక్షకాదరణ పొందింది. కేవలం తన వాక్చాతుర్యంతో షోను ఆద్యంతం ఆసక్తికరంగా నడిపించడంలో సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు సీజన్2 కోసం నేచురల్ స్టార్ నానిని ఎంపిక చేసుకున్నారు నిర్వాహకులు. తాజాగా ఈ షోలో నాని లుక్ ఎలా ఉండబోతుందో రివీల్ చేశారు. సింపుల్ లుక్ తో నాని ఆకట్టుకుంటున్నాడు. ఈ షో కోసం నాని రెండు కోట్ల పారితోషికం తీసుకున్నట్లు టాక్. ఈ షోలో గీతామాధురి, తేజస్వి మదివాడ, హీరో తరుణ్, గజాలా వంటి తారలు పోటీదారులుగా కనిపించనున్నారు. త్వరలోనే ఈ షో టీవీల్లో టెలికాస్ట్ కానుంది. ఈ షో కోసం హైదరాబాద్ అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ భారీ బిగ్ బాస్ హౌస్ సెట్ ను వేశారు.  సినిమాల పరంగా ప్రస్తుతం నాని, నాగార్జునతో కలిసి మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్నాడు. 

 

loader