ప్రభాస్ నటిస్తోన్న 'సాహో' సినిమాను పోస్ట్ పోన్ చేసి ఆగస్ట్ 30న విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారు. దీంతో అదే డేట్ న రావడానికి సిద్ధమైన నాని 'గ్యాంగ్ లీడర్' సినిమా చిక్కుల్లో పడింది. ఆగస్ట్ 30కి తగ్గట్లు టీమ్ మొత్తం ప్లాన్ చేసుకొంది. కానీ సడెన్ గా 'సాహో' రావడంతో నాని తన సినిమాను వాయిదా వేసుకోక తప్పలేదు.

కనీసం 'సై రా' వాయిదా పడితే గాంధీ జయంతి రోజు విడుదల చేయాలనుకున్నారు. కానీ చిరంజీవి సినిమా వాయిదా పడదని క్లారిటీ ఇవ్వడంతో 'గ్యాంగ్ లీడర్' సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ కారణంగా నానికి సోలో రిలీజ్ దొరకడం లేదు.

సెప్టెంబర్ 13న 'వాల్మీకి' సినిమా రిలీజ్ అవుతోంది కాబట్టి నాని సినిమాకి పోటీ తప్పదు. ఈ రెండు చిత్రాల నిర్మాతలు క్లాష్ అవాయిడ్ చేయడానికి చర్చలు జరుపుకున్నా.. ఇరు వర్గాలకు ఇదే డేట్ మీద మక్కువ ఉండడంతో క్లాష్ తప్పడం లేదు. 'వాల్మీకి' సినిమా తక్కువ బడ్జెట్ లో ప్రయోగాత్మకంగా తీస్తున్నారు. వరుణ్ తేజ్ మార్కెట్ వలన ఈ సినిమా కచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

మరోపక్క 'గ్యాంగ్ లీడర్' సినిమాకి కాస్త ఎక్కువగానే ఖర్చుపెట్టారు. అందుకే సోలోగా రిలీజ్ చేసుకోవాలని ఆగస్ట్ 30న ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఛాన్స్ లేక 'సాహో'తో పోటీ కంటే 'వాల్మీకి'తో పోటీ మంచిదని సర్దుకుపోతున్నారు. ఈ పోటీలో ఎవరు నెగ్గుతారో చూడాలి!