న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో డిఫరెంట్ గా తెరకెక్కిన జెర్సీ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. అయితే  ఇప్పుడు మరోసారి ఆడియెన్స్ ని ఫుల్ గా ఎంటర్టైన్ చేసేందుకు గ్యాంగ్ లీడర్ తో సిద్దమవుతున్నాడు నాని. విక్రమ్ కె కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సెప్టెంబర్ 13న  గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.. 

అయితే ప్రమోషన్ లో భాగంగా కథానాయకుడు నాని అభిమానులను కలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. త్వరలో నైజం - సీడెడ్ - ఆంధ్ర ఏరియాల్లో డైరక్ట్ గా నాని అభిమానుల ముందుకు రానున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తెలిపింది. ఇటీవల విడుదల చేసిన గ్యాంగ్ లిడర్ ప్రమోషనల్ సాంగ్ కి ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. 

అనిరుద్ కంపోజ్ చేసి మరి నానితో చిందులు వేయడం ఆడియెన్స్ తెగ ఎట్రాక్ట్ చేసింది. మొదటి రెండు పాటలు కూడా సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు నాని డైరెక్ట్ గా జనాల ముందుకు వెళుతుండడం సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.