గత ఏడాది నానికి కమర్షియల్ గా కలిసి రాలేదు. ఆయన నటించిన జెర్సీ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది కానీ కమర్షియల్ గా సంతృప్తిని ఇవ్వలేదు. ఇక గ్యాంగ్ లీడర్ యావరేజ్ టాక్ తో నష్టాలు మిగిల్చింది. దీనితో కసిగా వి టైటిల్ తో క్రైమ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ చేశారు. నాని ఈ మూవీలో సీరియల్ కిల్లర్ గా కనిపించనున్నారు. ఆయన పాత్ర నెగెటివ్ షేడ్స్ తో సాగుతుందట. దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో సుధీర్ పోలీస్ రోల్ చేశారు. 

టీజర్ అండ్ ట్రైలర్స్ తో సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. దీనితో విడుదలే ఆలస్యం హిట్ గ్యారంటీ అని నాని ఫిక్స్ అయ్యారు. ఐతే ఆయన ఆశలకు కరోనా రూపంలో అవరోధం ఏర్పడింది. థియేటర్స్ బంధ్ కావడంతో ఎప్పుడో మార్చి 25న విడుదల కావాల్సిన ఈ చిత్రం బాక్సులకే పరిమితం అయ్యింది. ఐదు నెలలు ఎదురుచూసిన నిర్మాత దిల్ రాజు, నాని ససేమిరా అంటున్నా అమెజాన్ ప్రైమ్ కి అమ్మేశారు. దీనితో కొద్దిరోజులలో నాని వి ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nani (@nameisnani) on Aug 19, 2020 at 6:32am PDT

ఐతే నేడు నాని తన ఇంస్టాగ్రామ్ లో ఓ ఆసక్తికర వీడియో పంచుకున్నారు. ఆ వీడియోలో రేపు వి మూవీ గురించి ఆసక్తికర అప్డేట్ ఉందన్నారు. అలాగే ఆయన థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇంటిలోకి రానుందని, ఆ థ్రిల్ ఇంటిలోనే అనుభవించనున్నారని చెప్పారు. దీనితో వి మూవీ టీమ్ ప్రేక్షకులకు థియేటర్స్ ఎక్స్పీరియన్స్ అందించడానికి స్పెషల్ టెక్నాలజీ పరిచయం చేయనున్నారా లేక కొన్ని థియేటర్స్ లో వి విడుదల చేస్తున్నారా అనే సందేహం మొదలైంది. దీనితో వి మూవీ గురించి మనకు తెలియని అప్డేట్ ఏమిటనే ఆసక్తిమొదలైంది.